
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా టాక్సీ వాలా నిలిచింది. డిఫరెంట్ జానర్స్ తో వస్తోన్న విజయ్ కెరీర్ లో స్పీడ్ గానే థ్రిల్లర్ జానర్ ను టచ్ చేశాడు. టాక్సీ వాలాకి సెట్స్ పై ఉండగానే లీకేజ్ బాధలతో సతమతమయ్యింది. అయినప్పటికీ కంటెంట్ కరెక్ట్ గా ఉంటె జనాలు తప్పకుండా హిట్ చేస్తారని ఈ సినిమా రుజువుచేసింది.
గత నెల నవంబర్ 17న రిలీజైన ఈ టాక్సీ వాలా మొత్తం వరల్డ్ వైడ్ గా 21 కోట్ల షేర్స్ ను అందుకుంది. అర్జున్ రెడ్డి - గీతగోవిందం తరువాత విజయ్ కు అత్యధిక లాభాలను అందించిన చిత్రంగా టాక్సీవాలా రికార్డ్ కొట్టేసింది. రాహుల్ ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీత ఆర్ట్స్ యువి క్రియేషన్స్ సంయుక్తంగా రిలీజ్ చేయడంతో మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది.
ఏరియాల వారీగా అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజాం....... 7.71cr
సీడెడ్.......1.64cr
ఉత్తరాంధ్ర......1.84cr
ఈస్ట్................ 0.96cr
వెస్ట్...............0.79cr
కృష్ణ.......1.14cr
గుంటూరు......1.15cr
నెల్లూరు.........0.46cr
ఏపీ+తెలంగాణా : రూ. 15.69cr
రెస్ట్ ఆఫ్ ఇండియా.....2.59cr
ఓవర్సీస్........3.02 cr
ప్రపంచవ్యాప్తంగా.... రూ.21.30 కోట్లు