నా ముఖం కూడా నాకు నచ్చలేదు... సీనియర్ నటుడు శరత్ సక్సేనా ఆవేదన

Published : May 28, 2023, 05:58 PM IST
నా ముఖం కూడా నాకు నచ్చలేదు... సీనియర్ నటుడు శరత్ సక్సేనా ఆవేదన

సారాంశం

తన ముఖం తనకే నచ్చదంటున్నాడు సీనియర్ నటుడు శరత్ సక్సేన. ఎన్నో సినిమాల్లో.. విలన్ పాత్రలు చేసిన  శరత్ .. తన పాత్రల గురించి సంచలన కామెంట్స్ చేశారు. 

 శరత్ సక్సేనా.. ఈ పేరు వింటే అర్ధం అవ్వదు కాని.. ముఠా మేస్త్రీ సినిమాలో మెయిన్ విలన్ ఆత్మ పాత్ర లేకుంటే.. సింహాద్రి సినిమాలో.. సింగమలై అనుచరుడి పాత్ర..  అనగానే వెంటనే చాలా మందికి గుర్తుకు వస్తుంది. సౌత్ తో పాటు.. బాలీవుడ్‌ సినిమాల్లో ఎన్నో సినిమాలు చేసిన ఆయన.. విలన్ గా.. నటించి  పోషించి మెప్పించాడు. బాలీవుడ్‌తోపాటు తెలుగు, తమిళం మలయాళం సినిమాల్లో.. కూడా ఆయన విలన్‌గా నటించారు. 

చాలా తక్కువ సినిమాలు చేసినా.. తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు శరత్ సక్సేన. ఒక్కొక్క పాత్ర  గుర్తుండిపోయేల చేశారు.. ఇంత  సాధించిన శరత్‌ సక్సేనా.. తనకు తన మొహం అస్సలు నచ్చేది కాదని చెబుతున్నాడు.తన మొహం తనకు ఎప్పుడూ నచ్చలేదని, అందుకే అద్దంలో మొహం చూసుకున్నప్పుడల్లా తనను తాను తిట్టుకునే వాడినని సక్సేనా షాకింగ్ కామెంట్లు చేశారు. తన ముఖం వల్లే తాను విలన్ పాత్రలు చేయాల్సి వస్తుందన్నారు. ముఖం బాగాలేకనే.. బాగాలేకనే కెరీర్‌ మొత్తం తాను  ప్రతి నాయకుడి పాత్రలు మాత్రమే చేయాల్సి వచ్చిందన్నారు శరత్. 

ఆయన మాట్లాడుతూ... నాకు ముందే తెలుస్తుంది.. ప్రతి సినిమాలో నేను విలన్.. నన్ను కొట్టడానికి  హీరో వస్తాడు, కొట్టేస్తాడు..  ఆ తర్వాత తనను తాను హీరోగా ప్రకటించుకుని సినిమాలో దూసుకువెళ్తాడు అని సక్సేనా తెలిపాడు. తన మొహం అందంగా లేకనే తాను విలన్‌ పాత్రలకు పరిమితం కావాల్సి వచ్చిందని బాధపడ్డారు కేరళ నటుడు. 

PREV
click me!

Recommended Stories

అజిత్‌ పై హీరోయిన్ క్రష్.. నువ్వు నా చెల్లివి అని షాకిచ్చిన హీరో, ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?
Gaayapadda Simham Movie Review: గాయపడ్డ సింహం రివ్యూ, తరుణ్ భాస్కర్ కు ట్రంప్ అంటే ఎందుకంత కోపం?