ఎన్టీఆర్‌కి నివాళ్లు అర్పిస్తూ #VS11 ఫస్ట్ లుక్‌.. విశ్వక్‌ సేన్‌ ఊరమాస్‌ లుక్‌

Published : May 28, 2023, 05:23 PM ISTUpdated : May 28, 2023, 05:24 PM IST
ఎన్టీఆర్‌కి నివాళ్లు అర్పిస్తూ #VS11 ఫస్ట్ లుక్‌.. విశ్వక్‌ సేన్‌ ఊరమాస్‌ లుక్‌

సారాంశం

సీనియర్‌ ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళ్ళు అర్పించారు హీరో విశ్వక్‌సేన్‌. తాను నటిస్తున్న `వీఎస్‌11` నుంచి తన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. 

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌.. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సితార ఎంటర్‌టైనర్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి హీరో విశ్వక్‌ సేన్‌ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకుని `జోహార్‌ ఎన్టీఆర్‌.. తెలుగోడి ఆత్మగౌరవం` అంటూ ఈ సినిమాలో విశ్వక్‌ లుక్‌ని విడుదల చేయడం విశేషం. ఇందులో విశ్వక్‌ సేన్‌ మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. చిన్న జుట్టు, మెలితిప్పిన మీసం, కొద్దిగెడ్డంతో కనిపిస్తున్నాడు విశ్వక్‌ సేన్‌. నోట్లో బీడీ, షర్ట్ మడతేస్తూ, వెనకాల పగుళ్లుపడ్డ ఉండగా విశ్వక్‌ ఊరమాస్‌ లుక్‌ అదిరిపోయేలా ఉంది. 

ఈ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ ద్వారా సినిమాలో విశ్వక్‌ సేన్‌ పాత్ర ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేసింది యూనిట్‌. ఇది నైతికత లేని సమాజంలో ఓ గ్రే మ్యాన్ యొక్క ప్రయాణాన్ని వర్ణించే చిత్రం అంటూనే..``VS11` చిత్రం చీకటి, క్రూరమైన ప్రపంచంలో అట్టడుగు నుంచి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి యొక్క కథను వివరిస్తుంది. ఈ ప్రపంచానికి నైతికత లేదు, దేనినీ పట్టించుకోదు. అలాంటి ప్రపంచంలో మనిషి మనుగడ సాగించాలంటే.. తన మార్గాన్ని నిర్ణయించుకోవడానికి అతనికి ప్రేరణ, స్ఫూర్తి అవసరం` అని తెలిపింది యూనిట్‌.

'తెలుగు వారి ఆత్మగౌరవం', 'లెజెండ్ ఆఫ్ లెజెండ్స్'గా పేరుగాంచిన స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 100వ జయంతి సందర్భంగా, `VS11` నుంచి ది రాగ్స్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, ఆ మహనీయుడిపై తమకున్న ప్రేమను చాటుకున్నాం. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. భారీస్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గంగానమ్మ జాతర పోస్టర్ సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచింది. ఇక ఇప్పుడు నివాళిగా విడుదల చేసిన పోస్టర్ తెలుగువారి హృదయాలను హత్తుకునేలా ఉంది.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తుంది. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవరిస్తున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

వరుసగా 7 ఫ్లాపులు, ఈసారి హిట్ కొట్టాల్సిందే.. హార్స్ రైడర్ అవతారం ఎత్తబోతున్న నితిన్
ఈవారం ఓటీటీ రిలీజ్ లు ఇవే..మయసభ, అరేబియా కడలితో పాటు మంచి కిక్కిచ్చే చిత్రాలు, సిరీస్ లు రెడీ