BJP ప్రోపగాండా ఫిల్మ్స్ తో రామ చరణ్ కు పనేంటి? విమర్శలు

By Surya PrakashFirst Published May 28, 2023, 3:16 PM IST
Highlights


 సావర్కర్‌‌ జీవితంలోని ఓ భాగాన్ని ఇందులో చూపించనున్నారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు 1905లో లండన్‌లో జరిగిన సంఘటనలు, విప్లవానికి ఆజ్యం పోసిన ఘటనలను చూపెడతారని తెలుస్తోంది. 

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గానే యూవీ క్రియేషన్స్ నిర్మాత విక్రమ్ రెడ్డి తో కలిసి స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ వి మెగా పిక్చర్స్ నుంచి అయితే ఈరోజు తమ మొదటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.   ఈ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ అయితే వచ్చేసింది. ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించనుండగా కొత్త దర్శకుడు రామ్ వంశీ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 

ఈ చిత్రం నుంచి టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. 1900 దశకం సమయంలో భారతదేశ చరిత్ర పుటల్లో లేని ఒక అధ్యాయాన్ని అయితే ఈ చిత్రంతో చేసే ప్రయత్నం మేకర్స్ చేస్తున్నారు. చిత్రానికి ‘ది ఇండియా హౌజ్’ అనే టైటిల్ ఖరారు చేశారు.  అంతవరకూ బాగానే ఉంది. 

అయితే  ఎప్పుడైతే స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా చరణ్ టైటిల్, మోషన్ వీడియోను రివీల్‌ చేశామని ప్రకటన చేసారో ఓ వర్గం నుంచి విమర్శలు మొదలయ్యాయి.భారత చరిత్రలో మరచిన అధ్యాయం ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని మోషన్ వీడియోలో చిత్ర బృందం తెలిపింది. సావర్కర్‌‌ జీవితంలోని ఓ భాగాన్ని ఇందులో చూపించనున్నారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు 1905లో లండన్‌లో జరిగిన సంఘటనలు, విప్లవానికి ఆజ్యం పోసిన ఘటనలను చూపెడతారని తెలుస్తోంది. అయితే వీరసావర్కర్ అంటే పడని వాళ్లు చాలా మంది ఉన్నారు. దాంతో వారంతా ఇప్పుడు సోషల్ మీడియాలో ... ఇది ఆర్.ఎస్ ఎస్ ప్రచార చిత్రం అని విమర్శలు చేస్తున్నారు. బిజేపి ప్రచార చిత్రాల వరసలో  ఈ సినిమా ఉంటుందని, కాశ్మీర్ ఫైల్స్ తీసిన నిర్మాత కూడా కొలాబరేట్ అవుతున్నారంటే అర్దం కావటం లేదా అంటూ సెటైర్స్ వేస్తున్నారు. రామ్ చరణ్ ఎందుకు ఇలా ఓ వర్గానికి నచ్చి, మెప్పించే చిత్రం చేస్తున్నారని నిలదీస్తున్నారు.

వీర్ సావర్కర్ ఇంగ్లాండ్‌లో న్యాయవిద్యను ఉపకారవేతనము (స్కాలర్‌షిప్) తో చదవడానికి ప్రభుత్వం నుంచి సహాయం అందుకున్నాడు . సావర్కర్ ను ఇంగ్లాండ్ పంపించి చదువు కొనసాగించడానికి శ్యాంజీ కృష్ణ వర్మ సహాయం చేశాడు. వీర సావర్కర్ 'గ్రేస్ ఇన్ లా కాలేజీ'లో చేరినాడు, ' ఇండియా హౌస్ 'లో వసతి పొందాడు. లండన్లో, వీర్ సావర్కర్ తన తోటి భారతీయ విద్యార్థులను ప్రేరేపించి, స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి 'ఫ్రీ ఇండియా సొసైటీ' అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ అంశాలు చుట్టూ అక్కడ లండన్ హౌస్లో ఉండగా జరిగిన కొన్నిసంఘటనలు ఆధారంగా ఈ కథ నడుస్తుందని చెప్తున్నారు.

 కొత్త డైరెక్టర్ రామ్‌ వంశీ కృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తికేయ2, ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మించిన అభిషేక్ అగర్వాల్‌ ఆర్ట్స్ సంస్థతో, వీ మెగా పిక్చర్స్‌ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది.  ఇందులో నిఖిల్ శివ పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ శ్యాంజీ కృష్ణ వర్మ పాత్రలో కనిపిస్తారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.  కాగా, నిఖిల్ ప్రస్తుతం ‘స్పై’ చిత్రంలో నటిస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. స్పై జూన్ 29న విడుదల కానుంది.

click me!