
శంకర్ (Shankar) డైరెక్షన్ లో మూవీ చేయడం చాలా మంది స్టార్ హీరోల డ్రీమ్. ఇప్పుడు కొంచెం ఆయన ఊపు తగ్గింది కానీ... ఓ దశాబ్దం క్రితం శంకర్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్. ఇండియన్ సినిమాకు గ్రాండియర్ పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం. మెగా పవర్ స్టార్ చడీచప్పుడు లేకుండా శంకర్ మూవీ ప్రకటించారు. ఆయనతోటి హీరోలు రెండు మూడు చిత్రాలు లైన్ లో పెడుతుంటే చరణ్ గుట్టుగా ఉన్నాడేమిటని ఫ్యాన్స్ భావించారు. శంకర్ తో మూవీ ప్రకటించగానే వాళ్ళ నిరుత్సాహం ఆవిరైపోయింది. ఫ్యాన్స్ ఓ భారీ చిత్రం రానుందని ఆశిస్తున్నారు.
రామ్ చరణ్ (Ram Charan)తో శంకర్ ఏ జోనర్ లో మూవీ చేస్తారనేది సందిగ్దత కొనసాగుతుంది. దీనిపై అనేక కథనాలు వెలువడ్డాయి. ఫైనల్ గా ఓ క్లారిటీ వచ్చింది. ఇది పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్ అట. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి కథ సమకూర్చారు. సుబ్బరాజ్ ఈ విషయం స్వయంగా ధృవీకరించారు. ఇక తన కథ దర్శకుడు శంకర్ కి ఎంతగానో నచ్చినట్లు, తెలియజేశాడు. ఆయన మెచ్చుకోవడంతో నేను ఎంతగానో గర్వంగా ఫీల్ అవుతున్నట్లు తెలియజేశారు.
శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా విడుదలైన పొలిటికల్ థ్రిల్లర్ ఒకే ఒక్కడు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఇంట్రడ్యూస్ చేసిన ఒక్కరోజు సీఎం కాన్సెప్ట్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. ఏ ఆర్ రెహమాన్ సాంగ్స్.. వాటిని ఆయన తెరకెక్కించిన తీరు అబ్బురపరిచింది. మరి చరణ్ తో శంకర్ తెరకెక్కించే ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇప్పటికే రామ్ చరణ్ మూవీ కొంత షూటింగ్ పూర్తి చేసుకుంది.
రామ్ చరణ్ పై సాంగ్స్, పోరాట సన్నివేశాలు భారీగా తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తున్న విషయం తెలిసిందే. ఫిజ్జా, జిగర్తాండ వంటి చిత్రాలతో కార్తీక్ సుబ్బరాజ్ ఫేమస్ అయ్యారు. రజినీకాంత్ తో పేట టైటిల్ తో మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు.
మరోవైపు చరణ్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సిద్ధమైంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మార్చ్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తుండగా.. అల్లూరి, కొమరం భీమ్ రోల్స్ చేస్తున్నారు. జనవరి 7న విడుదల కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే. కీరవాణి సంగీతం అందిస్తుండగా నిర్మాత డివివి దానయ్య రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించారు.