దక్కన్‌ సినిమాని మెయిన్‌ స్ట్రీమ్‌లోకి తీసుకురాబోతున్న `డీజే టిల్లు`.. పద్ధతిగా కథ రాసుకోలేదట..

Published : Feb 09, 2022, 07:31 PM ISTUpdated : Feb 09, 2022, 07:34 PM IST
దక్కన్‌ సినిమాని మెయిన్‌ స్ట్రీమ్‌లోకి తీసుకురాబోతున్న `డీజే టిల్లు`.. పద్ధతిగా కథ రాసుకోలేదట..

సారాంశం

మరోసారి దక్కన్‌ సినిమాని తెరపై ఆవిష్కరించబోతున్నారు `డీజే టిల్లు` బృందం. ఈ చిత్రం దక్కన్‌ సినిమాని పోలి ఉంటుందని, మరోసారి ఆ కల్చర్‌ని ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు హీరో సిద్దు జొన్నలగడ్డ. 

దక్కన్‌ సినిమా.. అంటే హైదరాబాదీ కల్చర్‌కి ప్రతిబింబం. మెయిన్‌ స్ట్రీమ్‌ చిత్రాలకు పారలల్‌గా ఈ చిత్రాలను రూపొందించేవారు. కానీ ఇప్పుడా సినిమాలు రావడం లేదు. కమర్షియల్‌ చిత్రాలకు ఆదరణ పెరిగిన నేపథ్యంలో దక్కన్‌ చిత్రాలను పట్టించుకోవడం లేదు. వాటిని ఆదరణ లేకపోవడం, ఆ వైపు వెళ్లే కొత్తతరం లేకపోవడంతో దక్కన్‌ సినిమా మనుగడ కోల్పోయింది. ఈ నేపథ్యంలో మరోసారి దక్కన్‌ సినిమాని తెరపై ఆవిష్కరించబోతున్నారు `డీజే టిల్లు`(DJ Tillu) బృందం. ఈ చిత్రం దక్కన్‌ సినిమాని పోలి ఉంటుందని, మరోసారి ఆ కల్చర్‌ని ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda). 

`గుంటూర్ టాకీస్`, `కృష్ణ అండ్ హిస్ లీల`, `మా వింతగాథ వినుమా` వంటి చిత్రాలతో నటుడిగా నిరూపించుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయనలో మంచి రైటర్‌ కూడా ఉన్నాడని తాజాగా `డీజే టిల్లు`తో నిరూపించుకోబోతున్నారు. ఆయన హీరోగా, నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్న `డీజే టిల్లు` చిత్రానికి విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, 'సితార ఎంటర్టైన్ మెంట్స్', ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల(ఫిబ్రవరి) 12న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా బుధవారం హీరో సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

నటుడిని అవ్వాలనే కోరిక చిన్నప్పటి నుంచీ ఉండేది. నాకు నేనే చిత్ర పరిశ్రమలో ఒక అవకాశాన్ని సృష్టించుకోవడం కోసం రచయితగా మారాల్సి వచ్చింది. `కృష్ణ అండ్ హిజ్ లీల` సినిమా తర్వాత నాగవంశీ గారు సినిమా చేయమని అవకాశం ఇచ్చారు. అలా 'డిజె టిల్లు' సినిమాకు శ్రీకారం చుట్టాం. నేను, దర్శకుడు విమల్ కృష్ణ కలిసి ఈ కథ, మాటలు రాశాం. రచనలో మా ఇద్దరి కృషి ఉంది.  ప్రేమ కథకు చిన్న క్రైమ్ కోణాన్ని జతచేసి రాసిన కథ ఇది.  నేను చిన్నప్పటి నుంచి చూసిన మనుషుల్లో ఒక ప్రత్యేకమైన ప్రవర్తన గమనించాను. వాళ్ల క్యారెక్టర్ లను తెరపై చూపించాలనుకుని ఈ సినిమాలో పాత్రలను రూపొందించాం. 

 నేను పెరిగిన మల్కాజ్ గిరి ఏరియాలో యూత్ చాలా డిఫరెంట్ గా ఉంటారు. తమ దగ్గర డబ్బు పెద్దగా లేకున్నా పైకి హంగామా చేస్తుంటారు. అందరితో కలిసి స్నేహం చేస్తారు. ఎవరికైనా అవసరం వస్తే సాయం చేస్తారు. ధైర్యంగా వ్యవహరిస్తుంటారు. వాళ్లలో నిజాయితీ ఉంటుంది. ఈ లక్షణాల స్ఫూర్తిగా తీసుకుని డిజె టిల్లు క్యారెక్టర్ రాసుకున్నాం. టిల్లు రాత్రంతా పోగ్రాముల్లో ఉంటారు. ఉదయం ఆలస్యంగా లేస్తారు. వాళ్లు కొత్త కొత్త ప్యాషన్ లు ఫాలో అవుతారు. హేయిర్ స్టైల్, డ్రెస్ లు  వేస్తుంటారు. మన టిల్లు కూడా అలాంటి మేకోవర్ లోనే కనిపిస్తాడు. పూర్తిగా తెలంగాణ యాసతో మాట్లాడుతుంటాడు. సినిమా టోటల్‌గా దక్కన్‌సినిఆని తలపిస్తుందని, కాకపోతే దానికి నెక్ట్స్ లెవల్‌ ఉంటుంద`న్నారు సిద్దు. ఓ రకంగా దక్కన్‌సినిమాని మెయిన్‌ స్ట్రీమ్‌లోకి ఈ చిత్రంతో తీసుకురాబోతున్నారని చెప్పొచ్చు. 

ఇంకా సిద్దు చెబుతూ, సినిమాలో టిల్లుకు పెద్దగా డీజే చేసే ప్రతిభ ఉండదు. ఏవో రెండు మాస్ పాటలు చేసి వాటితోనే ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు. ఆ రోజుకు వచ్చిన డబ్బులు ఖర్చు చేసేస్తాడు. అతనికి డబ్బులు వెనకేయాలి, ఇంకేదో చేయాలనే ఆలోచనలు ఉండవు. ఉన్నంతలో హాయిగా బతికేస్తుంటాడు. తన చుట్టూ తిరిగేవాళ్లకు ఖర్చు పెడుతుంటాడు. లేదంటే తన వెంట ఎవరూ తిరగరు. ఇది బుద్ధిగా, ఒక పద్దతితో రాసుకున్న కథ కాదు. క్యారెక్టర్ నుంచి, కథ నుంచి, త్రివిక్రమ్ గారి సూచనల నుంచి పుట్టిన అంశాలన్నీ కలిపి కథగా రాసుకున్నాం.  అప్పటిదాకా నవ్వించే టిల్లు ఒక మంచి విషయం చెప్పి ముగిస్తాడు. హీరో కోణంలో సాగే కథే ఇది. అయితే నాయికకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. హీరో ప్రేమ బాధితుడు. ఆ బాధ, విసుగు నుంచే కామెడీ పుడుతుంది. నవ్విస్తుంది.

 సితార సంస్థలో మాకు ఏ ఇబ్బందులు లేవు. సినిమా కోసం ఏది కావాలన్నా వచ్చేసేది. మాకు పెద్ద సమస్యలు అనుకున్నవి వంశీ గారు, చినబాబు గారు వెంటనే పరిష్కరించేవారు. వంశీ గారు మొన్న సినిమా చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. `డిజె టిల్లు`ను పెద్ద సినిమా చేయొచ్చు అని త్రివిక్రమ్ గారు ప్రోత్సహించారు. ఇటీవల సినిమా చూశాక కూడా ఇది హిట్ అవుతుంది. ఏ రేంజ్ హిట్ అనేది చూడాలి అన్నారు. మేమూ అదే చెబుతున్నాం. ఇక తాను పూర్తిగా హీరోగా రాణించాలనుకుంటున్నా. రైటర్‌గా భవిష్యత్‌ ఏంటనేది ఇప్పుడు చెప్పలేను` అని తెలిపారు సిద్ధు. ఇందులో తాను పాడిన పాట గురించి చెబుతూ, అది `గుంటూరు టాకీస్‌` టైమ్‌లో పాడిన పాట అని, లక్కీగా ఇందులో కుదిరిందని తెలిపారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం