
బిగ్‌బాస్(Bigg Boss) షో జనరల్‌గా కొత్త బంధాలను కలుపుతుంది. ఈ రియాలిటీ షోలోకి వచ్చిన వారు లవర్స్ గా మారిపోతుంటారు. షోలోనూ జోడి కట్టి ఆడియెన్స్ కి కావాల్సిన వినోదాన్ని పంచుతుంటారు. గత సీజన్‌లో అఖిల్, మోనాల్ జోడీ కట్టి షోని రక్తికట్టించడంలో కీలక పాత్ర పోషించారు. ఐదో సీజన్‌లో షణ్ముఖ్, సిరిల జోడీ ఆకట్టుకుంది. అయితే వీరిద్దరు మాత్రం మంచి స్నేహితులమనే చెప్పారు. ఫ్రెండ్స్ గానూ అలరించారు. కానీ దీని ఎఫెక్ట్ మాత్రం రియల్ లైఫ్‌లో పడింది. షణ్ముఖ్ ప్రేమకి చెక్ పెట్టిందని చెప్పొచ్చు.
బిగ్‌బాస్ 5(BiggBoss5)లో షణ్ముఖ్(Shanmukh), సిరి(Siri) కలిసి ఉండటం వల్ల జీర్ణించుకోలేని ఆయన ప్రియురాలు దీప్తిసునైనా(Deepthi Suniana).. షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పింది. దీంతో ప్రస్తుతం వీరిద్దరు ఒంటరిగానే ఉంటుంది. మరోవైపు షణ్ముఖ్ మరో ప్రియురాలిని వెతుక్కున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే షణ్ముఖ్, సిరి బ్రేకప్ తర్వాత సిరి-శ్రీహాన్‌లు కూడా విడిపోతున్నారని, తమ ప్రేమకి బ్రేకప్ చెప్పుకుంటున్నారనే రూమర్స్ గుప్పుమన్నాయి. అడపాదడపా ఈ రూమర్స్ హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. బిగ్‌బాస్ షో తర్వాత Siri, శ్రీహాన్ ఎక్కడ కలిసినట్టుగా కనిపించకపోవడంతో ఈ రూమర్స్ మరింతగా ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు సిరి, శ్రీహాన్. తాజాగా వీరిద్దరు యాంకర్ రవి ఫ్యామిలీతో దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండటంతో వీరి బ్రేకప్ రూమర్స్ కి చెక్ పెట్టినట్టయ్యింది. కేవలం ఒక్క ఫోటో అన్ని గాసిప్స్ కి బ్రేకులు వేసిందని చెప్పాలి. తాజాగా సిరి తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసిన ఫోటోతో బ్రేకప్ వార్తలకు ముగింపు పలికింది. ఇటీవల వీరిద్దరు కలిసి యాంకర్ రవి కుటుంబాన్ని కలిశారు.
వీరంతా కలిసి ఓ రెస్టారెంట్లో భోజనం చేసి సందడి చేశారు. ఆ సమయంలో వీరంతా కలిసి దిగిన ఫోటోలను యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. మీ ఇద్దరిని కలవడం చాలా సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేసింది. ఇందుకు సిరి కూడా హ్యాపీ అంటూ స్పందించింది. దీంతో ఇన్ని రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న బ్రేకప్ వార్తలకు ఎండ్ కార్డ్ పడింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఇక గతంలో తన ప్రేమని కోల్పోయిన సిరి.. బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో పాల్గొనడానికి ముందే శ్రీహాన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. వీరిద్దరు ఇష్టపడి ఒక్కటవ్వాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా, బిగ్‌బాస్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ 5 తర్వాత మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే షో తర్వాత వీరి రిలేషన్‌పై కూడా రూమర్స్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్ పిక్‌తో వారికి చెక్ పెట్టినట్టయ్యింది.