'ద్యావుడా'... ఇది షకీలా మార్క్ ప్రమోషన్

Published : Oct 09, 2017, 04:53 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
'ద్యావుడా'... ఇది షకీలా మార్క్ ప్రమోషన్

సారాంశం

శాన్వి క్రియేషన్స్ సమర్పించు అమృత సాయి ఆర్ట్స్ ఫిల్మ్ 'ద్యావుడా' సాయిరామ్ దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన ద్యావుడా కుమారి షకీలా చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియో విడుదల

శాన్వి క్రియేషన్స్ సమర్పించు అమృత సాయి ఆర్ట్స్ ఫిల్మ్ 'ద్యావుడా'. సాయిరామ్ దాసరి దర్శకత్వంలో భాను, శరత్, కారుణ్య, హరిణి, అనూష, జై  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత హరీష్ కుమార్ గజ్జల. జనవరి 1న టీజర్ విడుదల చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శనివారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ లో ఆడియో మరియు ట్రైలర్ ను విడుదల చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కుమారి షకీలా ముందుగా శివుడి విగ్రహానికి పాలాభిషేకం చేసి  ద్యావుడా చిత్ర ఆడియో మొదటి సీడీని సంగీత దర్శకుడు ప్రజ్వల్ క్రిష్ కు అందచేశారు. 

 

అనంతరం షకీలా మాట్లాడుతూ ఈ చిత్ర పాటలు, ట్రైలర్ లు చాలా బాగున్నాయి. మంచి కంటెంట్ తో వస్తున్న చిన్న సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నా,  సినిమా యూనిట్ కు  నా శుభాభినందనలను తెలియచేస్తున్నా అన్నారు. 

 

దర్శకుడు సాయిరామ్ దాసరి మాట్లాడుతూ షకీలా గారిచే మా ద్యావుడా చిత్ర గీతావిష్కరణ జరగడం ఆనందంగా ఉంది. సినిమా బాగొచ్చింది, తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం, ఈ నెల 13న సినిమాను విడుదల చేస్తున్నాం అని తెలిపారు. సాంగ్స్ బాగా వచ్చాయి. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా కృతఙ్ఞతలు అని సంగీత దర్శకుడు ప్రజ్వల్ క్రిష్ తెలిపారు. 

 

భాను, శరత్, కారుణ్య, హరిణి, అనూష, జై తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం : ప్రజ్వల్ క్రిష్, కెమెరా: తరుణ్, నిర్మాత:  హరీష్ కుమార్ గజ్జల, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: సాయిరామ్ దాసరి

PREV
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది