మంచు లక్ష్మి ట్వీట్ హాట్.. ఎవరికి ఏమివ్వాలో దేవుడికి తెలుసు

Published : Oct 09, 2017, 03:39 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
మంచు లక్ష్మి ట్వీట్ హాట్.. ఎవరికి ఏమివ్వాలో దేవుడికి తెలుసు

సారాంశం

హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలపై మంచు లక్ష్మి చేసిన ట్వీట్ పై రచ్చ రాజకీయ నేతలు ప్రోటోకాల్ లేకుండా ఇలాంటి రోడ్లపై తిరగాలన్న మంచు లక్ష్మి మంచు లక్ష్మి ట్వీట్ పై స్పందించిన రస్నా అనే అమ్మాయి తిరుమలలో వీఐపీ దర్శనం పేరుతో సామాన్యులను వెయిట్ చేేయిస్తున్నావుగా అని ప్రశ్న దానికి,దీనికి ఏం సంబంధం అంటూ ఘాటుగా స్పందించిన మంచు లక్ష్మి

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను, గుర్తింపును తెచ్చుకున్నారు మంచు లక్ష్మి. మోహన్ బాబు కూతురుగా.. మంచు అంటేనే కోపం అని, మంచు ముందు పుట్టి తర్వాత కోపం పుట్టిందేమో అని తరచూ అంటూ వుంటుంది మంచులక్ష్మి. అయితే.. తనకు ఓ సామాజిక సమస్యపై స్పందించాల్సి రావడం కొందరికి గిట్టక.. ఇటీవల ఆమె చేసిన ఓ ట్వీట్ ను వ్యతిరేకిస్తూ స్పందించారు. దీనిపై బాగానే రచ్చ జరిగింది.

 

ఆ రచ్చలో భాగంగా ట్విటర్ లో ఆమెను ఫాలో అవుతున్న కొందరు అభిమానులు, నెటిజన్లు ఆమె ట్వీట్ మీద భారీగా స్పందించారు. కొందరు ఆమెకు కౌంటర్ ఇస్తే, మరికొందరు సపోర్టు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడటంతో రోడ్లు పాడైపోయి చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్స్ ఎదురువుతున్నాయి. హైటెక్స్ ప్రాంతంలో మంచు లక్ష్మి కారు కూడా ట్రాఫిక్‌లో గంటన్నర పాటు ఇరుక్కుంది. దీంతో చిర్రెత్తిన ఆమె ఓ ట్వీట్ చేసింది.

విశ్వనగరానికి ప్రతీక అని చెప్పుకునే ఐటీ ప్రాంతం హైటెక్స్ ఏరియాలో గంటన్నర పాటు ట్రాఫిక్ లో ఇరుక్కు పోయాను. రాజకీయ నాయకులు ప్రోటోకాల్ లేకుండా మన లాగా ఇలాంటి ఈ దారిలో ప్రయాణించి ఇక్కడ పరిస్థితి ఏమిటో చూస్తే వారికి మన పెయిన్ ఏమిటో తెలుస్తుంది అంటూ ట్వీట్ చేసింది.

 

మంచు లక్ష్మి చేసిన ఈ ట్వీట్ పై రస్నా అనే ఓ అమ్మాయి.. స్పందిస్తూ ఆసక్తికర కామెంట్ చేసింది. మీలాంటి వారు వీఐపీ దర్శనాల పేరుతో తిరుమలకు వచ్చినపుడు కూడా మాకూ ఇలాంటి ఆలోచనలే వస్తాయి. నువ్వు కూడా మాలాగే వీఐపీ పాస్ లేకుండా సాధారణ క్యూ లైన్లలో నిల్చుని దర్శనం చేసుకుంటే మా పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది” అంటూ ట్వీట్ చేసింది.

రస్నా ట్వీటుకు మంచు లక్ష్మి రిప్లై ఇస్తూ.... “నువ్వు కూడా విఐపీ దర్శనం చేసుకోవచ్చు. దానికి నువ్వు డబ్బులు పే చేస్తే సరిపోతుంది. తిరుమల దేవాస్థానం రోడ్ల లాగా పబ్లిక్ ప్రాపర్టీ కాదు. అది అందరికీ కామన్ కాదు. నీలాగా మాటలు వదిలేయడం సులభమే. బి వెల్”.. అంటూ రిప్లై ఇచ్చింది.

 

అయితే.. మంచు లక్ష్మి ట్వీటుపై మరోసారి స్పందించిన రస్నా షాకింగ్ రిప్లై ఇచ్చింది. “వావ్ నేను కూడా విఐపీ కావొచ్చన్నమాట. అయితే విఐపీ అయిపోతా.... సాధారణ ప్రజలను క్యూలో మరింత వెయిట్ చేసేలా చేస్తా. విఐపీ అయితే ఇలాంటివి చాలా ఈజీ కదా. బి స్ట్రాంగ్” అంటూ కౌంటర్ ఇచ్చింది.

 

రస్నాతోపాటు మరికొంత మంది కూడా మంచులక్ష్మికి వ్యతిరేకంగా స్పందించారు. ఓ వ్యక్తి మంచు అక్కా మీ కోసమే ఈ సందేశం అంటూ... దేవుని దగ్గర అందరూ సమానమే అనే అర్థం వచ్చేలా వివరించే ప్రయత్నం చేశాడు.దీంతో తన పుట్టినరోజు(అక్టోబర్ 8) వేడుక జరుపుకుంటున్న సమయంలో ఇలాంటి రచ్చ ఏంటిరా బాబోయ్ అంటూ మంచులక్ష్మి తల పట్టుకుంది.

 

తనకు మన లీడర్లైన కేటీఆర్, లోకేష్ పర్సనల్ గా తెలుసని, అయితే సమస్యను పర్సనల్ గా చెప్పుకోకుండా అందరికీ ఉపయోగపడేలా వ్యవస్థ, రోడ్లు అన్నీ వుండాలని, నాలాంటి సెలెబ్రిటీలైన వాళ్లు కూడా మాట్లాడకుంటే ఇంకెవరు మాట్లాడుతారని భావించాననని,  అందుకోసమే పబ్లిగ్గా ట్వీట్ చేశానని మంచులక్ష్మి తెలిపింది. ఇలాంటి వాళ్లు సెలెబ్రిటీలుగా మారుతానంటే.. నేనేమన్నా అడ్డమున్నానా అంటూ ఘాటుగా స్పందించింది. దేవుడికి ఎవరికి ఏం ఇవ్వాలో అన్నీ తెలుసని కౌంటర్ ఇచ్చింది.

 

ఇలాంటి వాళ్లు నోటికొచ్చినట్లు ఎన్నైనా మాట్లాడుతారని.. ఏమైనా చెప్తారని, సమస్య పట్ల స్పందించడమే తన తప్పైపోయిందంటే... ఇంక నేనేం మాట్లాడగలనని మంచు లక్ష్మి అసహనం వ్యక్తం చేసింది. అందుకే ట్విటర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ సైట్లు ముక్కూ మొఖం తెలియని వాళ్లను బ్లాక్ చేసేందుకు ఆప్షన్ ఇచ్చాయని తేల్చి చెప్పింది. మంచు లక్ష్మికి సపోర్ట్ చేస్తున్న వారు కూడా ఒక రేంజ్ లో వుండటంతో ట్విటర్ లో కౌంటర్లు, పిన్ కౌంటర్లతో ఇదో హాట్ టాపిక్ అయిపోయింది.

PREV
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది