షకీలా బయోపిక్.. స్టార్ హీరోలే టార్గెట్!

Published : Nov 16, 2018, 11:36 AM IST
షకీలా బయోపిక్.. స్టార్ హీరోలే టార్గెట్!

సారాంశం

మలయాళంలో ఒకప్పుడు షకీలాకి ఉండే క్రేజే వేరు. ఆమె సినిమా విడుదలవుతుందంటే స్టార్ హీరోలు కూడా భయపడేవారు. తమ సినిమాకి కనీసపు ఓపెనింగ్స్ అయినా.. వస్తాయా అని ఆందోళన చెందేవారు. అంతగా మలయాళ ఇండస్ట్రీపై ప్రభావం చూపింది షకీలా. 

మలయాళంలో ఒకప్పుడు షకీలాకి ఉండే క్రేజే వేరు. ఆమె సినిమా విడుదలవుతుందంటే స్టార్ హీరోలు కూడా భయపడేవారు. తమ సినిమాకి కనీసపు ఓపెనింగ్స్ అయినా.. వస్తాయా అని ఆందోళన చెందేవారు. అంతగా మలయాళ ఇండస్ట్రీపై ప్రభావం చూపింది షకీలా. కానీ స్టార్ హీరోలు ఆమెను ఎదగకుండా చేశారనే వార్తలు అప్పట్లో హల్చల్ చేసేవి. కావాలని షకీలా సినిమాలను నిషేధించి ఆమె కెరీర్ ను దెబ్బ కొట్టారని అంటున్నారు.

ఇప్పుడు షకీలా జీవితం ఆధారంగా బయోపిక్ ని తెరకెక్కిస్తోన్నసంగతి తెలిసిందే. మొదట ఈ బయోపిక్ ని సాఫ్ట్ మ్యానర్ లో చూపించాలని అనుకున్నారు కానీ షకీలా అంటే మసాలా లేకపోతే ఎలా..? అందుకే ఇప్పుడు సినిమాను బోల్డ్ గా ట్రాన్స్పరంట్ గా చూపించడానికి సిద్ధమవుతున్నారు. షకీలా పాత్ర పోషిస్తోన్న రిచా చద్దా కూడా బోల్డ్ పెర్ఫార్మన్స్ కి రెడీగా ఉంది. షకీలా దగ్గరుండి తన కథను పర్యవేక్షించుకుంటుందట.

ఈ క్రమంలో తన జీవితంలో చోటుచేసుకున్న అతి పెద్ద సంఘటనలు ఏవీ మిస్ కాకుండా తన అన్యాయం చేసిన వారి పేర్లతో సహా బయటపెట్టాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మలయాళ స్టార్ హీరోలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి హీరోలు మలయాళ ఇండస్ట్రీలో షకీలా మనుగడ లేకుండా చేశారు. తనను తొక్కేయాలని ప్రయత్నించిన సూపర్ స్టార్ల ప్రస్తావన ఈ బయోపిక్ లో తీసుకురానున్నారు.

హీరోలు తన జీవితాన్ని ఎలా కష్టాలపాలు చేశారు..? ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారనే విషయాలను చూపించబోతున్నారు. ఇదే గనుక జరిగితే ఈ సినిమా వివాదాలకు కేంద్రబిందువుగా మారడం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

Dhurandhar 2 Collection Day 2: 200 కోట్లు కొల్ల గొట్టిన ధురంధర్ 2, రణవీర్ సింగ్ మూవీ రెండో రోజు వసూళ్లు ఎంత?
Top 10 Heroines: కోలుకున్న రష్మిక, కాజల్‌, తమన్నా.. పడిపోయిన త్రిష, శ్రీలీల.. నెంబర్‌ 1 హీరోయిన్‌ ఎవరంటే?