దీప్ వీర్ వెడ్డింగ్.. ట్రెండింగ్ లో సమంత!

Published : Nov 16, 2018, 10:58 AM IST
దీప్ వీర్ వెడ్డింగ్.. ట్రెండింగ్ లో సమంత!

సారాంశం

ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన బాలీవుడ్ జంట దీపిక, రణవీర్ సింగ్ లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సింధి, కొంకణి పద్దతుల్లో వీరి వివాహం రెండు సార్లు జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన రెండు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

అయితే వీరి ఫోటోలతో పాటు సోషల్ మీడియాలో సమంత ట్రెండింగ్ అవ్వడం విశేషం. సెలబ్రిటీ వెడ్డింగ్ అంటే ఆ హంగామానే వేరు. ముఖంగా వారు పెళ్లికి ధరించే బట్టలు, నగలు ట్రెండ్ అవుతుంటాయి. దీప్ వీర్ వెడ్డింగ్ లో కూడా వారు ధరించిన సభ్యసాచి వస్త్రాలు, ఆభరణాలు హాట్ టాపిక్ గా మారాయి. ఫ్యాషన్ ప్రియులు వీటి గురించే  మాట్లాడుకుంటున్నారు.

ఈ విషయంలో రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఇతర హీరోయిన్ల వెడ్డింగ్ కాస్ట్యూమ్స్ లను దీప్ వీర్ వెడ్డింగ్ కాస్ట్యూమ్స్ తో పోలుస్తున్నారు. దీపిక, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, సమంత, బిపాషా ఇలా చాలా మందితో పోలుస్తుండగా నెటిజన్ల ఎక్కువ శాతం ఓట్లు మాత్రం సమంతకే పడుతున్నాయి.

దీంతో దీప్ వీర్ వెడ్డింగ్ ఫొటోస్ కి బదులు సమంత పెళ్లి ఫోటో ట్రెండ్ అవుతోంది. సామ్-చైతుల వివాహం కూడా రెండు పద్దతుల్లో జరిగింది.సమంత తన పెళ్లికి నాగచైతన్య గ్రాండ్ మథర్  చీరను ధరించింది. అలానే క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ లో కూడా సమంత డ్రెస్ అందరినీ ఆకట్టుకుంది. 

PREV
click me!

Recommended Stories

Asha Bhosle Family: కూతురు ఆత్మహత్య, కొడుకు క్యాన్సర్‌తో మృతి.. ఆశా భోస్లే జీవితంలో పిడుగుల్లాంటి విషాదాలు, అయినా కూడా
Chiranjeevi: చిరంజీవి, రష్మీ ఫోన్ నంబర్స్ యంగ్ హీరో ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా.. అది మాత్రం నెక్స్ట్ లెవల్