కార్పోరేటర్‌పై కన్నేసిన హాస్యనటుడు శకలక శంకర్‌

Published : Nov 30, 2020, 01:12 PM IST
కార్పోరేటర్‌పై కన్నేసిన హాస్యనటుడు శకలక శంకర్‌

సారాంశం

తాజాగా మరోసారి హీరోగా తన లక్‌ని పరీక్షించుకోబోతున్నారు షకలక శంకర్‌. ప్రస్తుతం ఆయన `కార్పోరేటర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో షకలక శంకర్‌ `కార్పోరేటర్‌` పేరుతో సినిమా చేయడం ఆసక్తి నెలకొంది. 

హాస్యనటుడు షకలక శంకర్‌ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ మేనరిజంతో అటు హాస్యం, ఇటు యాక్షన్‌ మేళవిస్తూ హీరోగా రాణిస్తున్నారు. తాజాగా మరోసారి హీరోగా తన లక్‌ని పరీక్షించుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన `కార్పోరేటర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో షకలక శంకర్‌ `కార్పోరేటర్‌` పేరుతో సినిమా చేయడం ఆసక్తి నెలకొంది. తన రాజకీయాల్లో రూల్స్ లేవని శంకర్‌ టీషర్ట్ పై ఉండటం ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్‌ అని ఉంది, అంటే ఈ సినిమా విజయవాడ బ్యాక్‌డ్రాప్‌లో, అక్కడి షకలక శంకర్‌ రాజకీయాల ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని అర్థమవుతుంది. ఇందులో శంకర్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారట. ఇక ఈ చిత్రానికి సంజయ్‌ పూనూరి దర్శకత్వం వహిస్తున్నారు. సమీప మూవీస్-ఎయు అండ్ ఐ స్టూడియోస్ పతాకాలపై ఎ.పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. ఎస్.వి.మాధురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

`ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.  కార్పొరేషన్ ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో.. 5 పాటలు,  4 ఫైట్స్ కలిగిన రెగ్యులర్ ఫార్మట్ లోనే వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుందని, శంకర్ పెర్ఫార్మెన్స్ 'కార్పొరేటర్' చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు డాక్టర్ సంజయ్ చెప్పారు. 

శంకర్ సరసన సునీత పాండే, లావణ్య శర్, కస్తూరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి పీఆర్‌ఓ దీరజ అప్పాజీ, యాక్షన్ః వింగ్‌ చున్‌ అంజి, డాన్స్ః సూర్య కిరణ్‌, వెంకట్‌ దీప్‌, ఎడిటింగ్ః శివ శర్వాణి, కెమెరాః జగదీష్‌ కొమరి, సంగీతంః ఎం.ఎల్‌.పి. రాజా. సహనిర్మాతః డాక్టర్‌ ఎస్.వి.మాధురి, నిర్మాతః సహ నిర్మాత: డాక్టర్ ఎస్.వి.మాధురి, నిర్మాత: ఎ.పద్మనాభరెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంజయ్ పూనూరి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?