బాలీవుడ్‌ నటి దివ్య భట్నాగర్‌ కి కరోనా పాజిటివ్‌..వెంటిలేటర్‌పై చికిత్స

Published : Nov 30, 2020, 08:53 AM IST
బాలీవుడ్‌ నటి దివ్య భట్నాగర్‌ కి కరోనా పాజిటివ్‌..వెంటిలేటర్‌పై చికిత్స

సారాంశం

దివ్యకి ఆరు రోజుల నుంచి టెంపరేచర్‌ చాలా ఎక్కువగా ఉంది. నీరసంగా, అసౌకర్యవంతంగా ఫీలయ్యింది. ఢిల్లీ నుంచి ఆక్సీమీటర్‌ తీసుకొచ్చి ఆక్సిజన్‌ లెవల్‌ని పరీక్షించారు. అవి 71కి పడిపోయాయి. దీంతో ఆమెని ఆసుపత్రికి తరలించాము. 

బాలీవుడ్‌ నటి దివ్య భట్నాగర్‌కి కరోనా సోకింది. ఆమె గత ఆరు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటం, నీరసంగా ఉండటంతో కోవిడ్‌ టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ఆమె పరిస్థితి ప్రస్తుతం సీరియస్‌గా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు దివ్య కుటుంబ సభ్యులు తెలిపారు. దివ్య తల్లి ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ముంబయిలోని ఎస్‌ఆర్‌వీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు.

ఆమె మాట్లాడుతూ, `దివ్యకి ఆరు రోజుల నుంచి టెంపరేచర్‌ చాలా ఎక్కువగా ఉంది. నీరసంగా, అసౌకర్యవంతంగా ఫీలయ్యింది. ఢిల్లీ నుంచి ఆక్సీమీటర్‌ తీసుకొచ్చి ఆక్సిజన్‌ లెవల్‌ని పరీక్షించారు. అవి 71కి పడిపోయాయి. దీంతో ఆమెని ఆసుపత్రికి తరలించాము. ఇప్పుడు ఆమె ఆక్సిజన్‌ స్థాయి 84 ఉందని, దివ్య ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని, తాజాగా అందిన నివేదికల ప్రకారం ఆమెకి కరోనా పాజిటివ్‌ అని తేలిందని వెల్లడించింది. వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతున్నట్టు తెలిపింది.

డైలీ సీరియల్‌ `యే రష్టా క్యా కెహ్లతా హై`తో నటిగా పాపులర్‌ అయిన దివ్య భట్నాగర్‌ని ఆ మధ్యనే తన భర్త వదిలేశాడు. ఆమెని మోసం చేసి వెళ్లిపోయాడని దివ్య తల్లి పేర్కొంది. `దివ్యని ఆమె భర్త కూడా మోసం చేశాడు. ఆమెని వదిలేశాడు. మాకు తెలియకుండానే ఆమె వివాహం చేసుకుంది. వివాహం తర్వాత దివ్య ఓషివారాలోని ఓ చిన్న ప్రదేశంలో నివసిస్తున్నట్టు తెలిసి నేను చాలా బాధపడ్డాను. అంతకు ముందు మీరా రోడ్డు వద్ద పెద్ద ఇంట్లో ఉండేది. లగ్జరీ జీవితాన్ని అనుభవించింది. కానీ ప్రేమ పెళ్ళితో చాలా ఇబ్బందులు పడింది` అని పేర్కొంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే