పిల్లల పెంపకంలో అవన్నీ పిచ్చి మాటలు.. కాస్త రఫ్‌గానే పెంచాలంటోన్న నాగబాబు

Published : Nov 30, 2020, 10:44 AM IST
పిల్లల పెంపకంలో అవన్నీ పిచ్చి మాటలు.. కాస్త రఫ్‌గానే పెంచాలంటోన్న నాగబాబు

సారాంశం

పిల్లల గురించి నాగబాబు చెబుతూ, పిల్లలకు కావాల్సినంత స్వేచ్ఛ ఇవ్వాలని, తమ కాలంలో ఉన్న వాతావరణం ఇప్పుడు లేదని, మాకు, మా పిల్లలకు దొరికినంత స్వేచ్ఛ, వాళ్ల పిల్లలకు, నెక్ట్స్ జనరేషన్‌ పిల్లలకు దొరకడం లేదని, మన భయాలు, ఆలోచనలు వాళ్ళ స్వేచ్ఛకు ఆటంకం కాకూడదని చెప్పారు.   

పిల్లలకు స్వేచ్ఛ నివ్వాలని, కాస్త రఫ్‌గా పెంచాలని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని  దైర్యంగా ఎదుర్కొనేలా తయారు చేయాలని అంటున్నారు మెగా బ్రదర్‌ నాగబాబు. ఆయన యూట్యూబ్‌లో మోటివేషనల్‌ స్పీచ్‌లు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తాము పెరిగిన విధానం, పిల్లల్ని పెంచాల్సిన విధానంపై అనేక విషయాలను పంచుకున్నారు. 

నాగబాబు చెబుతూ, తమ కాలంలో పిల్లల్ని పెంచే విధానం ఇప్పటితో పోల్చితే వేరేలా ఉండేదన్నారు. తాము పరీక్షల్లో ఫెయిల్‌ అయినా, పాస్ అయినా మా ఇంట్లో ఏం అనేవాళ్ళు కాదు. కాకపోతే పాస్‌ కావాలని చెప్పేవారని, పాస్‌, ఫెయిల్‌ ముఖ్యం కాదు, సబ్జెక్ట్, సామాజిక పరిణతికి ప్రాధాన్యతనిచ్చేవారని చెప్పారు. ఈ విషయాల్లో తమ తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు ఉందని, ఏ విషయంలోనూ తమపై ఒత్తిడి పెంచాలేదని నాగబాబు చెప్పారు. 

ఇంకా చెబుతూ, ఎక్సైజ్‌ డిపార్ట్ మెంట్‌లో పనిచేసే మా నాన్నకు చాలా లోకజ్ఞానం ఉండేదని, మా కోరికలను, ఆలోచలను గౌరవిస్తూనే, మాకు మార్గనిర్ధేశం చేసేవారని తెలిపారు. చిరంజీవి సినిమాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారట. తాను లైఫ్‌లో సెటిల్‌ కావడానికి, నిర్మాతగా మారడానికి అన్నయ్య చిరంజీవినే కారణమని, తనని స్వతంత్రంగా ఎదగాలని చెప్పేవారని పేర్కొన్నాడు నాగబాబు. మేం ఏం పనిచేసినా ఆ విషయంలో మాకు అంతిమ నిర్ణయాన్ని ఇచ్చేవారని, కాకపోతే, ప్లాన్‌ బీతో కూడా ఉండేవారని తెలిపారు. 

ఇక పిల్లల గురించి నాగబాబు చెబుతూ, పిల్లలకు కావాల్సినంత స్వేచ్ఛ ఇవ్వాలని, తమ కాలంలో ఉన్న వాతావరణం ఇప్పుడు లేదని, మాకు, మా పిల్లలకు దొరికినంత స్వేచ్ఛ, వాళ్ల పిల్లలకు, నెక్ట్స్ జనరేషన్‌ పిల్లలకు దొరకడం లేదని, మన భయాలు, ఆలోచనలు వాళ్ళ స్వేచ్ఛకు ఆటంకం కాకూడదని చెప్పారు. 

పిల్లలను రఫ్‌గా పెంచాలన్నారు. ఎండలో ఆడిపించాలని, వర్షంలో తడవనివ్వాలని, అలా చేయకూడదనేది పిచ్చి మాటలని చెప్పారు. వాళ్లని ప్రకృతిని ఆస్వాధించేలా చేయాలన్నారు. మరీ సున్నితంగా పెంచకూడదని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలన్నారు. తండ్రి రోజుకి కనీసం గంటైనా వారితో ఆడుకోవాలని, అప్పుడే వాళ్ళ ఆలోచనలు, సామర్థ్యాలు తెలుస్తాయ`ని చెప్పారు. నిర్మాతగా ఫెయిల్‌ అయిన నాగబాబు నటుడిగా, హోస్ట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తనయుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా రాణిస్తుండగా, తనయు నిహారిక మెప్పించలేకపోయింది. త్వరలో ఆమె పెళ్ళి చేసుకోబోతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

MSG: అనిల్‌ రావిపూడి చేసిన పనికి చుట్టాల్లో ఇబ్బంది పడ్డ వెంకటేష్‌ భార్య, చిరంజీవి వద్ద వెంకీ ఆవేదన
Chiranjeevi:మూవీ ప్రమోషన్ ఎఫెక్ట్.. మెగా డాటర్స్ పై భయంకరమైన ట్రోల్స్.. ఎందుకో తెలుసా?