
కింగ్ ఖాన్ షారుఖ్ ఏం చేసిన ఫ్యాన్స్ కి యమా క్రేజీగా ఉంటుంది. పఠాన్ సక్సెస్ తో షారుఖ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఫ్యాన్స్ అయితే షారుఖ్ నెక్స్ట్ మూవీ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. షారుఖ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో జవాన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. షారుఖ్ ఫ్యాన్స్ కి ఇది కాస్త సర్ప్రైజింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఆర్యన్ ఖాన్ D'YAVOL X అనే సరికొత్త దుస్తుల బ్రాండ్ ని ప్రారంభించారు. ఈ దుస్తుల బ్రాండ్ కి ప్రచార కర్త తన తండ్రి షారుఖ్ కావడం విశేషం.
తన తండ్రిపై ఆర్యన్ ఖాన్ ఓ యాడ్ షూట్ కూడా చేశారు. ఈ బిజినెస్ లో భాగంగా ఆర్యన్ ఖాన్ ముందుగా బ్లాక్ లెదర్ జాకెట్స్ ని లాంచ్ చేశారు. ఈ జాకెట్ హ్యాండ్ పై Xఅనే రెడ్ పెయింట్ ఉంటుంది. అలాగే షారుఖ్ ఖాన్ స్వయంగా చేసిన సిగ్నేచర్ ఉంటుంది. ఈ ఒక్క జాకెట్ ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం. ఈ జాకెట్ ధర అక్షరాలా 2 లక్షలు.
మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ జాకెట్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవలసిందే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొందరు నెటిజన్లు ఆర్యన్ ఖాన్ పై సెటైర్లు వేస్తున్నారు. ఆర్యన్ భయ్యా.. మాకు షారుఖ్ అంటే అభిమానం ఉంది. అలాగని కిడ్నీ అమ్ముకుని జాకెట్ కొనుక్కోలేం కదా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
కామెంట్స్ ఎలా ఉన్నా ఈ జాకెట్స్ తొలి ఎడిషన్ కేవలం ఒక్క రోజులో అమ్ముడయ్యాయి. షారుఖ్ బ్రాండ్ కి ఉన్న విలువ అది అని ఫ్యాన్స్ అంటున్నారు. రానున్న రోజుల్లో ఆర్యన్ ఖాన్ ఇలాంటి లగ్జరీ బ్రాండ్స్ మరిన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రస్తుతం ఈ లెదర్ జాకెట్ ఫోటోలు, షారుఖ్ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వివాదంలో చిక్కుకుని అరెస్ట్ కావడం.. ఆ తర్వాత పోలీసులు అతడికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిన సంగతి తెలిసిందే.