‘నా జీవితమే వాడు.. ఇంత మోసం చేస్తాడనుకోలేదు’.. చైతన్య మాస్టర్ సూసైడ్ పై తల్లి ఆవేదన..

By Asianet News  |  First Published May 1, 2023, 4:09 PM IST

టాలెంటెడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య (Choreographer Chaitanya) ఆత్మహత్యను ఆయన తల్లి జీర్ణించుకోలేకపోతోంది. ఈసందర్భంగా  ఆమె మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.
 


తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్, ‘ఢీ’షో డాన్స్ కొరియోగ్రాఫర్  చైతన్య (Choreographer Chaitanya) ఆత్మహత్య సంచలనంగా మారింది. సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ సూసైడ్ కు పాల్పడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇప్పటికే చైతన్య ఆత్మహత్యపై  ఢీషోకు సంబంధించిన జడ్జీ శ్రద్ధా దాస్,  యాంకర్ రష్మి గౌతమ్, తోటి కొరియో గ్రాఫర్స్, డాన్సర్లు స్పందిస్తున్నారు. ఇప్పటికే చైతన్య చెల్లి కూడా బోరున విలపించింది.  

తాజాగా తనకొడుకు చైతన్య ఆత్మహత్యపై తల్లి లక్ష్మీ స్వరాజ్యం  ఆవేదన వ్యక్తం చేసింది. చిట్టి మాస్టర్ తో చెప్పుకుంటూ భావోద్వేగమైంది.  ఆమె మాట్లాడుతూ..  అప్పుల బాధతో నా కొడుకు చనిపోయాడనేది అబ్ధమే. ఎప్పుడూ అప్పుల విషయం నాకు చెప్పలేదు. ఫ్రెండ్స్ కూడా చెప్పలేదు. డబ్బుల కంటే ఆరోగ్యం ముఖ్యమమ్మా అనేవాడు. డాన్సర్లకు మంంచి ఫుడ్ పెడితేనే మనల్ని  గౌరవిస్తారు. డబ్బుల్ది ఏముందమ్మా, ఎప్పుడైనా సంపాదించుకోవచ్చని అన్నాడు.

Latest Videos

తీరా అప్పుల బాధతోనే చనిపోతున్నానని చెప్పాడు. అడిగితే నేను ఇచ్చేదాన్ని.. నా జీవితమే వాడు. ఎన్నో కష్టాలు పడ్డాం. అయినా వాడు వెళ్లిపోయాడు. చనిపోయే 15 నిమిషాల ముందుకు కూడా బాగానే మాట్లాడాడు. చివరికి మమల్ని మోసం చేశాడు. నేను చనిపోతున్నా నువ్వూ రా అమ్మా అంటే నేనూ వెళ్లేదాన్ని కదా’ అంటూ చైతన్య తల్లి బోరున విలపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక చైతన్య మాస్టర్ మరణం పట్ల ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు స్పందిస్తున్నారు.

ఢీ15 ప్రస్తుత సీజన్ లో కొరియోగ్రఫర్ గా చేస్తున్న చైతన్య ఉన్నట్టుండి సూసైడ్ చేసుకోవడంతో అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణానికి ముందు సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశాడు. కొద్దిరోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఆ పరిస్థితులే సూసైడ్ కు కారణమయ్యాయని అర్థం అవుతోంది. నెల్లూరు క్లబ్ హోటల్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

click me!