
ప్రముఖ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ ఆత్మహత్య సంఘటన ప్రకంపనలు రేపుతోంది. నెల్లూరులో ఓ హోటల్ లో చైతన్య మాస్టర్ ఆదివారం రోజు సూసైడ్ చేసుకున్నారు. ఢీ లాంటి పాపులర్ డ్యాన్స్ షోతో గుర్తింపు పొందిన చైతన్య మాస్టర్ మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణం అని తెలుస్తోంది.
మరణించే ముందు సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో ద్వారా చైతన్య మాస్టర్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక పోతున్నాననే మానసిక ఒత్తిడిలో ఆయన ఆత్మహత్యకి పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలో ఢీ షోపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఢీ షోకి గాను తనకి సరైన రెమ్యునరేషన్ ఇవ్వలేదని చైతన్య మాస్టర్ తన సెల్ఫీ వీడియోలో తెలిపారు. ఢీ కంటే జబర్దస్త్ లో చేసే వారికే ఎక్కువ రెమ్యునరేషన్ వస్తోందని వాపోయారు. చైతన్య మాస్టర్ మృతిపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి తాజాగా స్పందించారు. ఆత్మహత్య చేసుకోవడం తప్పు అని అన్నారు.
రెమ్యునరేషన్ అందడం లేదు అనేది కూడా కరెక్ట్ కాదు. ఆయనకి పాత అప్పులు ఉంది ఉండొచ్చు లేదా రెమ్యునరేషన్ సరిపోకపోయి ఉండొచ్చు.. అంతే కానీ పూర్తిగా ఇవ్వడం లేదు అనేది కరెక్ట్ కాదు. చైతన్యకి ఇంకేమైనా సమస్యలు ఉండిఉంటాయి అని అన్నారు. ఇక జబర్దస్త్ లో రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తున్నారు అని పోల్చుకోవడం కూడా సరైంది కాదు అని తమ్మారెడ్డి అన్నారు. రాజమౌళికి 100 కోట్లు ఇస్తారు.. త్రివిక్రమ్ కి 50 కోట్లు.. అలాగని నేను వాళ్ళతో పోల్చుకుని ఆత్మహత్య చేసుకున్నానా.. మల్లెమాల సంస్థ పైనో ఇంకొకరిపైనో బురదజల్లడం కరెక్టేనా అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.