షారూక్ ఖాన్‌ను ముంబై ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న అధికారులు.. కారణమేమిటంటే..?

Published : Nov 12, 2022, 05:27 PM IST
షారూక్ ఖాన్‌ను ముంబై ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న అధికారులు.. కారణమేమిటంటే..?

సారాంశం

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌ను, ఆయన టీమ్‌ను ముంబై ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌ను, ఆయన టీమ్‌ను ముంబై ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. షారుక్ ఖాన్‌ను, అతనితో పాటు మరికొందని గత రాత్రి ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు అడ్డుకున్నారు. వారి బ్యాగేజీలో ఉన్న కొన్ని లగ్జరీ వాచీల కారణంగా కొన్ని గంటల పాటు వారిని ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిపివేశారు. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించే ముందు కస్టమ్స్ డ్యూటీ కింద వారు రూ. 6.83 లక్షలు చెల్లించినట్టుగా తెలుస్తోంది.

అయితే ఎయిర్‌పోర్ట్‌లోని నిలిపివేసిన కొద్దిసేపటి తర్వాత షారుక్ ఖాన్, అతని మేనేజర్ పూజ విమానాశ్రయం నుండి బయలుదేరడానికి అనుమతించబడినట్టుగా సమాచారం. అయితే షారుక్ ఖాన్ బాడీగార్డ్ రవి, మిగిలిన బృందం తదుపరి ప్రక్రియను పూర్తి చేయడానికి విమానాశ్రయం వద్ద ఆగిపోయినట్టుగా తెలుస్తోంది.

ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రైవేట్ టెర్మినల్‌లో శనివారం తెల్లవారుజామున యాపిల్ ఐవాచ్, మరో ఆరు హై-ఎండ్ వాచ్‌లు తీసుకెళ్తున్నందుకు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, అతని బృందంలోని ఐదుగురు సభ్యులను కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఆపివేశారు. వస్తువుల మొత్తం విలువ రూ.17.86 లక్షలు అని.. షారుఖ్ ఖాన్, అతని టీమ్ సభ్యులతో కలిసి వస్తువుల విలువలో 38.5 శాతం కస్టమ్స్ సుంకం కింద రూ. 6.88 లక్షలు చెల్లించిన తర్వాత అక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతించారు.ఈ మేరకు పలు ఆంగ్ల  మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. 

ఇక, షారుక్ ఖాన్ షార్జాలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ జెట్‌లో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద షారుఖ్ ఖాన్ అతని టీమ్ దిగింది. అయితే టెర్మినల్ నుంచి బయలుదేరినప్పుడు లగ్జరీ వాచీలు లగేజీలో కనిపించాయి.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు