#Yashoda: "యశోద" కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి? ఏ ఓటిటికి లాక్

Published : Nov 12, 2022, 10:12 AM IST
#Yashoda: "యశోద" కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి? ఏ ఓటిటికి  లాక్

సారాంశం

 స‌మంత హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో రూపొందిన య‌శోద సినిమా నేడు (నవంబర్ 11) పాన్‌ ఇండియ‌న్ లెవ‌ల్‌లో భారీ ఎత్తున రిలీజైంది. స‌రోగ‌సీ కాన్సెప్ట్‌తో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు హ‌రీ, హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.


స్టార్ బ్యూటీ సమంత తాజాగా "యశోద" అనే ఒక సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సరోగసి కాన్సెప్ట్ తో నడిచే ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించటంతో మంచి ఓపినింగ్స్ వచ్చాయి. దర్శక ద్వయం హరి మరియు హరీష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రం గా తెరకెక్కింది. ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి చూద్దాం

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం యశోద చిత్రం మొదటి రోజు  దేశవ్యాప్తంగా రూ.3.20 కోట్ల వసూలైనట్లు సమాచారం. ఈ వీకెండ్‌కు ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు బాగానే ఉంటాయని అంటున్నారు. యశోద నిన్న రాత్రి షోలు అడ్వాన్స్ బుక్కింగ్స్ గ్రాస్ యాభై లక్షలు ఉంది.  57% ఆక్యుపెన్సీతో అన్ని మల్టిఫ్లెక్స్ లు ఫాస్ట్ ఫిల్ అయ్యాయి.ఈ రోజు కూడా అదే ట్రెండ్ నడుస్తుందని అంటున్నారు. యశోద హైదరాబాద్ సిటీ రెండో రోజు  అడ్వాన్స్ బుక్కింగ్స్ బాగున్నాయి.  అంతా సవ్యంగా సాగితే మొత్తంగా 30 నుంచి 35 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని సమాచారం.

 మరో ప్రక్క ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ కూడా ఫిక్స్ అయింది. ఈ చిత్రం డిజటల్ రైట్స్‌ను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. యశోద మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాను ఇప్పుడప్పుడే ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు కనిపించట్లేదు. కనీసం 4 లేదా 5 వారాలు తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?