నేను గర్భవతిని...  బిగ్ బాస్ భామ పూజా రామ చంద్రన్ ప్రకటన!

Published : Nov 12, 2022, 02:55 PM IST
నేను గర్భవతిని...  బిగ్ బాస్ భామ పూజా రామ చంద్రన్ ప్రకటన!

సారాంశం

బిగ్ బాస్ ఫేమ్ పూజా రామచంద్రన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆమె తన ప్రెగ్నెన్సీ ప్రకటించారు. భర్త జాన్ కొక్కెన్ తో రొమాంటిక్ ఫోజులు షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

బిగ్ బాస్ ఫేమ్ పూజా రామచంద్రన్ ప్రెగ్నెన్సీ ప్రకటన చేశారు. తాను గర్భవతిని అయ్యానన్న శుభవార్త ఫ్యాన్స్ తో పంచుకున్నారు. భర్త జాన్ కొకెన్ తో పాటు రొమాంటిక్ ఫోజుల్లో దిగిన ఫొటోలో ట్విట్టర్ లో షేర్ చేశారు. అనేక భావోద్వేగాల మా జర్నీ మరో కీలక దశకు చేరింది. వచ్చే ఏడాది మా కుటుంబంలోకి మరొక వ్యక్తి వస్తున్నారని పూజా ట్వీట్ చేశారు. 

పూజా రామ చంద్రన్ 2019లో కెజిఎఫ్ ఫేమ్ జాన్ కొకెన్ ని వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇది రెండో వివాహం. 2017లో పూజా రామచంద్రన్ విజె క్రెగ్ ని వివాహమాడారు. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం నటుడు జాన్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. 

స్వామి రారా చిత్రంతో పూజా రామ చంద్రన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. హీరో నిఖిల్ క్రైమ్ పార్టనర్ గా పూజా రామ చంద్రన్ నటించారు. బిగ్ బాస్ షోతో ఆమె మరింత చేరవయ్యారు. నాని హోస్ట్ గా 2018లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2 లో పూజా రామచంద్రన్ పాల్గొన్నారు. మంచి పోటీ ఇచ్చిన పూజా భాష రాక ఇబ్బందిపడ్డారు. దీంతో మధ్యలోనే ఎలిమినేటై వెళ్లిపోయారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు