సెప్టెంబర్‌ 9న చెన్నైలో స్పైడ‌ర్ అడియో ఫంక్ష‌న్

Published : Sep 08, 2017, 08:42 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
సెప్టెంబర్‌ 9న చెన్నైలో స్పైడ‌ర్ అడియో ఫంక్ష‌న్

సారాంశం

సూపర్‌స్టార్‌ మహేష్ ఎ ఆర్ మురుగదాస్‌ కాంబినేషన్ వ‌స్తున్న మూవీ స్పైడ‌ర్  తెలుగు త‌మిళ్ క‌న్న‌డ భాషాల్లో రిలీజ్  అవుతున్న స్పైడ‌ర్ సినిమా  సెప్టెంబర్‌ 9న చెన్నైలో స్పైడ‌ర్ అడియో ఫంక్ష‌న్

 

సూపర్‌స్టార్‌ మహేష్  ఎ ఆర్ మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది.

ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌ 9న చెన్నైలో చాలా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అలాగే సెప్టెంబర్‌ 15న ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో భారీ ఎత్తున విడుదల చేస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌ 27న దసరా కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే