పవన్ మహేష్ బాబు అభిమానులు రాళ్లు రువ్వుకున్నారు

Published : Sep 08, 2017, 08:12 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
పవన్ మహేష్ బాబు అభిమానులు రాళ్లు రువ్వుకున్నారు

సారాంశం

టాలీవుడ్ లో పుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హిరోలు మ‌హేష్ బాబు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముమ్మిడివరంలో ఒక‌రిపై ఒక‌రు దాడులు చేసుకున్న ప‌వ‌న్ మ‌హేష్ అభిమానులు ఈ వివాదం హోం మంత్రి చిన్న‌రాజ‌ప్ప వ‌ర‌కు వెళ్లింది

 

ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో జరిగింది. ఫ్లెక్సీ మధ్య వచ్చిన వివాదం మహేష్ - పవన్ అభిమానులు దాడులు చేసుకునే వరకు వెళ్లింది గణేష్ నిమజ్జనం సందర్భంగా తారాజువ్వలు పేల్చుతారు. ఫ్యాన్స్ ఇరువురి బ్యానర్లు, ఫ్లెక్సీలు భారీగా కట్టారు. నిమజ్జనం సందర్భంగా మహేష్ బాబు అభిమాను తారాజువ్వలు కాల్చారు.

 ఇది ప్రమాదవశాత్తు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి తగిలి, అంటుకుంది. దీంతో పవన్  మహేష్ బాబు అభిమానులు రాళ్లు రువ్వుకున్నారు. కావాలనే ఫ్లెక్సీని అంటించారని పవన్ ఫ్యాన్స్ ఆరోపించారు. ఆరుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను అమలాపురం ఆసుపత్రికి తరలించారు. ఫ్లెక్సీల కారణంగా జరిగిన వివాదాన్ని జిల్లా ఎస్పీ హోంమంత్రి చినరాజప్ప దృష్టికి తీసుకు వెళ్లారు

కోనసీమ వ్యాప్తంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అమలాపురం డిఎస్పీ గ్రామంలో పర్యటించారు. ఘర్షణకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో పవన్ - మహేష్ బాబు అభిమానులతో మాట్లాడారు. శాంతియుతంగా ఉండాలని సూచించారు

ఈ ప్రాంతాల్లో పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యే సమయంలో ఉద్రిక్తత కనిపిస్తుంది. పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అభిమానులకు కౌన్సెలింగ్ ఇస్తారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్‌లు స్నేహంగానే ఉంటారు. కానీ అభిమానులు మాత్రం గొడవపడుతున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే