టక్ జగదీష్ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తిచేంది.కరోనా కాస్త తగ్గాక రిలీజ్ ఉంటుంది. మరో ప్రక్క నాని శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న హీరో ఎవరూ అంటే నాని అని చెప్పాలి. వరసపెట్టి ఎంటర్ టైన్మెంట్ పాత్రల్లో నటించే నాని వీ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నాని టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాలు చేస్తున్నాడు. టక్ జగదీష్ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తిచేంది.కరోనా కాస్త తగ్గాక రిలీజ్ ఉంటుంది. మరో ప్రక్క నాని శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమా కావడంతో హైదరాబాద్‌లోనే కోల్‌కతా సెట్ నిర్మించారు. దాదాపు పది ఎకరాల విస్త్రీర్ణంలో రూ.6.5 కోట్ల బారీ బడ్జెట్‌తో ఈ సెట్‌ను రూపొందిస్తున్నారు. శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్‌లోనే ఇప్పటివరకూ భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తోంది.ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది.దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి నాన్ థియేట్రికల్ రైట్స్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
ట్రైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 'శ్యామ్ సింగ రాయ్' మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కు 30 కోట్లకు పైగా చెల్లించడానికి ముందుకొస్తున్నారని తెలుస్తోంది. దాంతో సినిమా పెట్టుబడి దాదాపు అరవై శాతం రికవరీ ఉంటుందని అంటున్నారు. మరో ప్రక్క సినిమా థియోటర్ రైట్స్ కు ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయట. ఇదంతా మీడియాలో జరుగతున్న ప్రచారం. అయితే ఈ స్దాయి బిజినెస్ నాని సినిమాకు జరుగుతోందా అనే సందేహం కొందరు వెల్లబుచ్చుతున్నారు. ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది.
ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండగా.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. డిఫెరంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.