అఖిల్ కారణంగా మహేష్ వందకోట్ల బడ్జెట్ మూవీ ఆగిపోయిందా!

Published : Apr 24, 2021, 04:10 PM IST
అఖిల్ కారణంగా మహేష్ వందకోట్ల బడ్జెట్ మూవీ ఆగిపోయిందా!

సారాంశం

ఏలియన్ కాన్సెప్ట్ లో భారీ బడ్జెట్ తో మహేష్ కోసం రచయిత వెలిగొండ శ్రీనివాస్ ఓ కథ రాసుకున్నారట. ఆ కథను దర్శకుడు కోడి రామకృష్ణకు ఆయన వినిపించగా చాలా బాగుంది, పూర్తి కథను సిద్ధం చేయండి అన్నారట.

స్టార్ హీరోలు దాదాపు ప్రయోగాల జోలికి వెళ్ళరు. ప్రయోగాలు ఫలించే అవకాశాలు చాలా తక్కువ. కమర్షియల్ చిత్రాలకు సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్యాన్స్ కూడా ఆ తరహా చిత్రాలనే తమ హీరోల నుండి కోరుకుంటూ ఉంటారు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే... ఆయన ప్రయోగానికి ప్రయత్నించిన ప్రతిసారి ఫెయిల్ అయ్యాడు. నిజం, నానీ, స్పైడర్, వన్ నేనొక్కడినే ఈ కోవకు చెందిన చిత్రాలే.

అయితే మురారి కూడా ఒక విధంగా ప్రయోగాత్మక చిత్రమే. కానీ ఆ మూవీ మహేష్ కి మంచి విజయాన్ని కట్టబెట్టింది. కాగా  ఏలియన్ కాన్సెప్ట్ లో భారీ బడ్జెట్ తో మహేష్ కోసం రచయిత వెలిగొండ శ్రీనివాస్ ఓ కథ రాసుకున్నారట. ఆ కథను దర్శకుడు కోడి రామకృష్ణకు ఆయన వినిపించగా చాలా బాగుంది, పూర్తి కథను సిద్ధం చేయండి అన్నారట. అయితే వంద కోట్ల బడ్జెట్ వరకు అవసరమయ్యే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళ్ళేది లేనిది, ఇలాంటి మరో ప్రయోగత్మక చిత్ర ఫలితం తరువాత ఆలోచిద్దాం అని శ్రీనివాస్ అనుకున్నారట.

హీరోగా అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ కోసం ఆయన అలాంటి కథనే సిద్ధం చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. దీనితో మహేష్ తో ఏలియన్ కాన్సెప్ట్ లో సినిమా తెరకెక్కించాలన్న ఆలోచన వదిలి వేశారట. అఖిల్ మూవీ ఫలితం మహేష్ ప్రయోగత్మక ప్రాజెక్ట్ అటకెక్కడానికి కారణం అయినట్లు తాజా ఇంటర్వ్యూలో రచయత శ్రీనివాస్ తెలిపారు.

 

PREV
click me!

Recommended Stories

Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌
Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?