మ్యారేజ్‌ డే స్పెషల్‌గా కూతురిని పరిచయం చేసిన బిగ్‌బాస్‌ ఫేమ్‌ హరితేజ

Published : Apr 24, 2021, 01:11 PM ISTUpdated : Apr 24, 2021, 01:17 PM IST
మ్యారేజ్‌ డే స్పెషల్‌గా కూతురిని పరిచయం చేసిన బిగ్‌బాస్‌ ఫేమ్‌ హరితేజ

సారాంశం

బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటి హరితేజ తన కూతురిని పరిచయం చేసింది. పెళ్లిరోజుని పురస్కరించుకుని శనివారం తమ చిన్నారి ఫోటోని అభిమానులతో పంచుకుంది. 

బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటి హరితేజ తన కూతురిని పరిచయం చేసింది. పెళ్లిరోజుని పురస్కరించుకుని శనివారం తమ చిన్నారి ఫోటోని అభిమానులతో పంచుకుంది. `పాప రాకతో తమ మ్యారేజ్‌ యానివర్సరీ మరింత స్పెషల్‌గా మారింద`ని తెలిపి హరితేజ. ఈ సందర్బంగా భర్త దీపక్‌తో కలిసి బిడ్డని ఎత్తుకున్న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది. ఈ సందర్భంగా పలువరు టీవీ, సినీ ప్రముఖులు హరితేజ జంటకి అభినందనలు తెలియజేస్తున్నారు. దీంతో ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతోంది హరితేజ. 2015లో దీపక్‌ని వివాహం చేసుకుంది హరితేజ. 

ఈ నెల 5న హరితేజ పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. టీవీ సీరియల్స్ తో పేరు తెచ్చుకున్న హరితేజ `biggboss` మొదటి సీజన్‌లో పాల్గొని మరింతగా పాపులర్‌ అయ్యింది. టీవీతోపాటు సినిమాల్లోనే మెరిసింది. `అ..ఆ`, `దిక్కులు చూడకు రామయ్య`, ` రాజా ది గ్రేట్`‌, `హిట్`, `సరిలేరు నీకెవ్వరు`, `ప్రతిరోజు పండగే`, `ఎఫ్ 2`, `అరవింద సమేత`, `డీజే`, `విన్నర్‌`, `అత్తారింటికి దారేదీ`, `యూటర్న్`, `శ్రీనివాస కళ్యాణం` లాంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో హరితేజ నటించిన సంగతి తెలిసిందే.  చివరగా `జాంబిరెడ్డి`, `అల్లుడు అదుర్స్` చిత్రాల్లో మెరిసింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది