
సౌత్ లో విలక్షణ నటిగా గుర్తింపు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల తన ప్రియుడు నికోలాయ్ సచ్ దేవ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో వరలక్ష్మి వివాహం వైభవంగా జరిగింది.
నీకొలాయ్ సచ్ దేవ్ ముంబై కి చేసిన ఆర్ట్ గ్యాలరిస్టు. అతడికి గ్యాలరీ 7 పేరుతో ముంబైలో సొంతంగా ఆర్ట్ గ్యాలరీ వ్యాపారం ఉంది. ఇక్కడికి తరచుగా బాలీవుడ్ సెలెబ్రిటీలు వస్తుంటారు. ఆ విధంగా నీకొలాయ్ కి సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి. తొలిసారి నికొలాయ్ సచ్ దేవ్, వరలక్ష్మి అక్కడే కలుసుకున్నారట. పరిచయం పెరగడంతో ఫ్రెండ్స్ అయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత తొలిసారి నికోలాయ్ వరలక్ష్మీ గురించి మీడియాతో మాట్లాడారు. ఇకపై నేను తమిళం నేర్చుకున్నా. ఇప్పటికి పొంతటి అనే పదం నేర్చుకున్నా. అంటే భార్య. నా సొంత ఇల్లు కూడా చెన్నైలో ఉండాలనుకుంటున్నా. పెళ్లయింది కాబట్టి వరలక్ష్మి తన పేరుని వరలక్ష్మి సచ్ దేవ్ గా మార్చుకోవడం లేదు. ఆ అవసరం కూడా లేదు.
నేనే నా పేరుని నికోలాయ్ వరలక్ష్మి సచ్ దేవ్ అని మార్చుకోబోతున్నట్లు అతడు ప్రకటించాడు. వరలక్ష్మి నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. కానీ వరలక్ష్మి ఫస్ట్ లవ్ నేను కాదు. ఆమె ఫస్ట్ లవ్ ఎప్పుడూ సినిమాలే. పెళ్లి తర్వాత కూడా వరలక్ష్మి సినిమాల్లో నటిస్తుంది అని నికోలాయ్ తెలిపాడు.