సీనియర్ ప్రొడ్యూసర్ గురుపాదం హఠాన్మరణం.. చిరంజీవి, శ్రీదేవితో ఆ చిత్రాలు నిర్మించి..

Published : Feb 04, 2023, 05:31 PM IST
సీనియర్ ప్రొడ్యూసర్ గురుపాదం హఠాన్మరణం.. చిరంజీవి, శ్రీదేవితో ఆ చిత్రాలు నిర్మించి..

సారాంశం

చిత్ర పరిశ్రమలో విషాదాలు ఆగడం లేదు. లెజెండ్రీ డైరెక్టర్ కె విశ్వనాథ్, దర్శకుడు సాగర్, గాయని వాణీ జయరామ్ మరణవార్తలని జీర్ణించుకోక ముందే మరో సీనియర్ నిర్మాత మృత్యువాత పడ్డారు.

చిత్ర పరిశ్రమలో విషాదాలు ఆగడం లేదు. లెజెండ్రీ డైరెక్టర్ కె విశ్వనాథ్, దర్శకుడు సాగర్, గాయని వాణీ జయరామ్ మరణవార్తలని జీర్ణించుకోక ముందే మరో సీనియర్ నిర్మాత మృత్యువాత పడ్డారు. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ గురుపాదం(53) హఠాన్మరణం చెందారు. గుండె పోటు రావడంతో ఆయన బెంగుళూరులోకి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆయన 25 పైగా చిత్రాలు నిర్మించారు. 1970 జనవరి 1న గురుపాదం జన్మించారు. 53 ఏళ్ళ వయసులోనే ఆయన మరణించడం విషాదంగా మారింది. చిత్ర పరిశ్రమలో ప్రముఖులు గురుపాదం మృతితో విషాదం వ్యక్తం చేస్తున్నారు. 

తెలుగులో ఆయన వయ్యారి భామలు వగలమారి భర్తలు, పులి బెబ్బులి లాంటి చిత్రాలు నిర్మించారు. పులి బెబ్బులి చిత్రంలో చిరంజీవి, కృష్ణంరాజు హీరోలుగా నటించారు. వయ్యారి భామలు వగలమారి భర్తలు చిత్రంలో స్వర్గీయ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ కలసి నటించారు. ఇక హిందీలో ఆయన శ్రీదేవి, జితేంద్ర లతో అకల్మండ్ అనే చిత్రాన్ని నిర్మించారు. పరభాషా చిత్రాలని తెలుగులో అనువాదం చేసి రిలీజ్ చేశారు. 

గురుపాదం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. గురుపాదం ఆకస్మిక మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ ప్రముఖులు ఆయన చిత్ర పరిశ్రమకి చేసిన సేవలని గుర్తు చేసుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss కు వెళ్ళడం వల్ల చాలా నష్టపోయాను, అవకాశాలు కోల్పోయాను, టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Varun Sandesh: అందుకే మాకు పిల్లలు పుట్టలేదు, వచ్చే ఏడాది గుడ్ న్యూస్ చెబుతామంటున్న హీరో