షూటింగ్ లో గాయపడిన సీనియర్ హీరోయిన్ టబు, అద్దాలు గుచ్చుకుని ఇబ్బంది పడ్డ స్టార్...

By Mahesh JujjuriFirst Published Aug 11, 2022, 11:05 AM IST
Highlights

ఓ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదం వల్ల సీనియర్ హీరోయిన్.. టాలీవుడ్,బాలీవుడ్ స్టార్ టబు గాయపడ్డారు. అద్దాలు గుచ్చుకోవడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. 

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు చేసి.. స్టార్ ఇమేజ్ సాధించింది టబు. హీరోయిన్ గా పెయిడ్ అవుట్ అయిన తరువాత క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ.. సీనియర్ నటిగా మారింది టబు. తెలగుతో పాటు హిందీ సినిమాల్లో కూడా ఇంపార్టెంట్ క్యారెరెక్టర్ రోల్స్ చేస్తోంది సీనియర్ బ్యూటీ. ఇక రీసెంట్ గా ఆమో ఓ షూటింగ్ లో గాయపడినట్టు తెలుస్తోంది. 

 ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్  సందర్భంగా గాయాలపాలైంది టబు.  ఆమె ప్రస్తుతం అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో వస్తున్న భోలా సినిమాలో నటిస్తోంది .ఈ సినిమాలో ఆమె ఓ  పోలీస్ అధికారిణి క్యారెక్టర్ లో కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఈ షూటింగ్ లో భాగంగా టబు పై చేజింగ్ సీన్స్ ను కంప్లీట్ చేస్తున్నారు టీమ్. ఈ పని జరుగుతుండగానే టబుకు ప్రమాధం జరిగినట్టు తెలుస్తోంది. 

చేజింగ్ లో భాగంగా జరిగే సన్నివేశంలో ట్రక్కు అద్దాలు పగిలిపోవడంతో టబు నుదుటిపైనా, కంటికి దగ్గరగా గాయాలయ్యాయి.  అయితే కంటికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన టబును యూనిట్ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.  రీసెంటో గా మరో సీనియర్ బాలీవుడ్ హీరోయిన్  శిల్పాశెట్టి కూడా ప్రమాదానికి  గురైన విషయం తెలిసిందే..  ఓ వెబ్ సిరీస్ షూటింగ్ లో భాగంగా స్టంట్ సీన్ తెరకెక్కిస్తుండగా.. శిల్పాకు కాలు విరిగింది. ఇలా వరుసగా హీరోయిన్లు గాయాలపాలు అవుతున్నారు. 

click me!