గుజ‌రాతీ థాలిని ఎంజాయ్ చేస్తోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, లైగర్ ప్రమోషన్స్ లో రౌడీ హీరో బిజీ బిజి

By Mahesh JujjuriFirst Published Aug 11, 2022, 7:08 AM IST
Highlights

లైగర్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. గతంలో ఎప్పుడు లేని విధంగా అన్ని రాష్ట్రాలు తీరుగుతున్నాడు. అందులో భాగంగా గుజరాత్ తో విజయ్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. 
 

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫస్ట్ టైమ్ భారీ స్థాయిలో.. పాన్ ఇండియా రేంజ్ లో  చేసిన సినిమా లైగర్.  పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.  ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది మూవీ. భారీ అంచనాలతో విడుదల అవ్వబోతున్న ఈసినిమా ప్రమోష్స్ ను అంతే భారీగా టీమ్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా.. అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్ ఈవెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. 

తాజాగా ఈమూవీ టీమ్ గుజరాత్ లో ప్రమోషన్ ఈవెంట్స్ తో బిజీగా ఉన్నారు. అక్కడ భారీగా ఆడియన్స్ లైగర్ టీమ్ కు బ్రహ్మరథం పట్టారు. అందరూ ఔరా అనేంతగా విజయ్ క్రేజ్ పెరిగిపోయింది.  దాంతో బాలీవుడ్ కూడా షాక్ అయ్యి చూస్తోంది. ఇక ఈ సందర్భంగా   ఆ రాష్ట్రంలో జ‌రిగిన సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న విజ‌య్‌... స్థానిక ఆహారం గుజ‌రాతీ థాలిని టేస్ట్ చేశారు. ఆయన గుజరాత్ థాలీ ప్లేట్ ముందు కూర్చుని దానిని ఆర‌గించేందుకు సిద్ధ‌ప‌డుతున్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. 

ఈ ఫొటోను విజ‌య్ స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గుజ‌రాతీ స్థానిక వంట‌కాల‌తో కూడిన  ప్లేట్‌లో ప‌లు ర‌కాల వంట‌కాల‌ను పెద్ద ప్లేట్‌లో అమ‌ర్చారు. ఆ ప్లేట్‌లోని ఆహార ప‌దార్థాల‌ను ఆస‌క్తిగా గ‌మ‌నిస్తూ విజ‌య్ కూర్చుని ఉన్నాడు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక నెటిజన్లు వేలల్లో కామెంట్లు చేస్తున్నారు. ఇక లైగర్ సినిమాపై కూడా భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఈ సినిమాతో విజయ్ ఏలాంటి రిజల్ట్ సాధిస్తాడో చూడాలి. 

click me!