Shobana: సీనియర్ హీరోయిన్ శోభనకు ఒమిక్రాన్... ఎలా వచ్చిందో వివరించిన నటి

Published : Jan 10, 2022, 01:37 PM IST
Shobana: సీనియర్ హీరోయిన్ శోభనకు ఒమిక్రాన్... ఎలా వచ్చిందో వివరించిన నటి

సారాంశం

ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది కరోనా. కొత్త వేరియెంట్స్ తో జనాలు ఇబ్బందిపడుతున్నారు. పేదా.. ధనికా.. అన్న తేడా లేకుండా.. అందరిని ఇబ్బంది పెడుతుంది కోవిడ్. ఇండస్ట్రీలో స్టార్స్ సెలబ్రిటీస్ ను కూడా వదలడం లేదు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది కరోనా. కొత్త వేరియెంట్స్ తో జనాలు ఇబ్బందిపడుతున్నారు. పేదా.. ధనికా.. అన్న తేడా లేకుండా.. అందరిని ఇబ్బంది పెడుతుంది కోవిడ్. ఇండస్ట్రీలో స్టార్స్ సెలబ్రిటీస్ ను కూడా వదలడం లేదు.

కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు...స్టార్ ఫిల్మ్ సెలెబ్రిటీస్ కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, తమన్, సత్యరాజ్, మంచు లక్ష్మీ, కమల్ హాసన్(Kamal Hasan), అర్జున్ కపూర్(Arjun Kapoor ) ఫ్యామిలీ.. ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్స్ కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కోలుకోగా.. మరికొంత మంది చావు అంచులు చూసి వెనక్కి వచ్చారు.

ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్.. డాన్సర్ శోభన(Shobana) కరోనా బారిన పడ్డారు. అది కూడా.. ఇప్పుడు అందరిని భయపెడుతున్న ఒమిక్రాన్ బారిన పడ్డారు శోభన. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు ఆమె. తనకు కరోనా ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదంటూ శోభన ఇన్ స్టాలో ఓ అనౌన్స్ మెంట్ చేశారు.

 

ప్రపంచమంతా అద్బుతంగా నిద్రపోతున్న వేళ.. తాను ఒమిక్రాన్ బారిన పడ్డట్టు తెలిపారు శోభన(Shobana). అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా తనను కూడా వదిలిపెట్టలేదన్నారు. తాను రెండు డోసుల వాక్సిన్ తీసుకున్నా.. కోవిడ్ నుంచి తప్పించుకోలేకపోయానన్నారు శోభన. కీళ్ళనొప్పులు, చలి, జ్వరం, గొంతునొప్పి,జలుబుతో బాధపడుతున్నట్టు శోభన(Shobana) చెప్పారు. తాను టీకా చేయించుకున్నందున 85 శాతం వరకూ రక్షణ పొందుతానన్న నమ్మకం ఉందన్నారు.

Also Read: Satyaraj: సత్యరాజ్ కి ఆసుపత్రిలో కరోనా ట్రీట్మెంట్... తీవ్రత అధికం కావడంతో ఆందోళన!

ఇక  అందరూ తప్పకుండా వాక్సిన్ చేయించుకోవాలి అన్నారు శోభన. ప్రపంచంలో కేసులు చాలా పెరిగిపోతున్నాయి అందుకే దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలి అని కొరారు శోభన. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని. అందరూ జాగ్రతగ్గా ఉండాలన్నారు. సినిమాలకు దూరంగా ఉన్న శోభన ప్రస్తుతం క్లాసికల్ డాన్సర్ గా పేరుగాంచారు. దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ.. కాలం గడిపేస్తున్నారు.

Also Read: Sanjana Galrani: ట్రోలర్స్ నోరు మూయించిన సంజనా గల్రాని.. ప్రెంగ్నెంట్ అని ప్రకటన

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : బాంబ్ పేల్చిన దాసు, షాక్ లో శివన్నారాయణ ఫ్యామిలీ, జ్యో రహస్యం బయటపడిందా ?
Gunde Ninda Gudi Gantalu: ఓవైపు శివ, మరోవైపు ప్రభావతి.. బాలు, మీనా కాపురంలో చిచ్చు పెట్టేశారుగా..!