
డైరెక్టర్ హరీష్(Harish Shankar) శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ముఖ్యంగా ట్విట్టర్ లో ఆయన రోజూ చాలా పోస్ట్ లు పెడుతుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగే పరిణామాలు.. రాష్ట్రోంలో.. దేశంలో జరిగే రాజకీయ పరిణామాలపై ట్విట్టర్ వేదికగా స్పదిస్తుంటారు హరీష్. అంతే కాదు వింతలు విశేషాలు.. నలుగురికి ఉపయోగపడే వీడియోలను కూడా తన పేజ్ ద్వారా ఫాలోవర్స్ కు అందిస్తుంటారు. రీసెంట్ గా అలాంటి వీడియోను ఒకటి పోస్ట్ చేశారు హరీష్ శంకర్(Harish Shankar)
ప్రస్తుతం కరోనా థార్డ్ వేవ్ నడుస్తుంది. దేశం అంతా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందరూ భయం గుప్పెట్లో ఉన్నారు. చాలా మంది బయటకు రావడం మానేశారు. ఇక చాలా మంది మాత్రం తమకు ఏమీ పట్టనట్టు.. మాస్కులు కూడా పెట్టుకోకుండా తిరిగేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తులు చెపుతున్నా పెడచెవిన పెడుతున్నారు. ఈ విషయంపై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు. ఒక డాక్టర్ ఒమిక్రాన్ గురించి మాట్లాడిన వీడియో బైట్ ను పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో డాక్టర్ మాట్లాడుతూ.. కరోనా గురించి భయపడకండీ.. కాని నిర్లక్ష్యం చేయవద్దు.. కేసులు పెరుగుతున్నాయి కాని మరణాలు మాత్రం నమోదు అవ్వడం లేదు. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవకసరం లేదు. కాని జాగ్రత్తగా మాత్రం ఉండాలి అంటూ.. ఆ వీడియోలో ఉంది. ఈ వీడియోతో నెటిజన్లకు మంచి మెసేజ్ ఇవ్వాలి అనుకున్నారు హరీష్ శంకర్(Harish Shankar)
Also Read : Sukumar-Pushpa:పుష్ప మూవీలో సుకుమార్ చేసిన బ్లండర్ మిస్టేక్... మీరు కనిపెట్టారా?
దీనిపై చాల మంది పాజిటీవ్ గా స్పందిస్తుండగా.. మరికొంత మంది మాత్రం ట్రోల్ చేస్తున్నారు. ఇవి బాధత్యారాహిత్యంగా ఉందీ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అలాంటి కామెంట్ కు హరీష్ (Harish Shankar)స్పందించారు. ఒక డాక్టర్ మన కోసం ఇంత అద్భుతంగా.. అందరికి ఉపయోగపడేలా..మంచి చెప్పినా.. మీలాంటి వారు నిరాశ చెందుతూనే ఉంటారు అంటూ హరీష్ ఘాటు రిప్లై ఇచ్చారు.
హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) తో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ జరుగుతుంది. భవదీయుడు భగత్ సింగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమా ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ కొట్టింది.
Also Read : Salman Khan New Movie : 3 పాత్రలు.. 10 మంది హీరోయిన్లు.. రచ్చ చేయబోతున్న సల్మాన్ ఖాన్