పృధ్వీ నన్ను మోసం చేశారు.. మాజీ హీరోయిన్ సంఘవి కామెంట్స్ వైరల్

Published : Apr 15, 2023, 07:36 PM IST
పృధ్వీ నన్ను మోసం చేశారు.. మాజీ హీరోయిన్ సంఘవి కామెంట్స్ వైరల్

సారాంశం

ఈ మధ్య 90 స్ తారలు ఎక్కువగా బుల్లితెరపై సందడి చేస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు..  సంఘవి ప్రముఖ నటుడు, విలన్ బబ్లూ పృధ్వీ రాజ్, మహేశ్వరి.. ఈక్రమంలో ఫృధ్వీపై మండిపడ్డారు సంఘవి. తనను మోసం చేశాడంటూ ఆరోపణలు చేశారు 

80, 90 దశకంలో తెలుగు తెరను ఒక ఊపు ఊపిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అందులో 90 హీరోయిన్లలో స్టార్ డమ్ తెచ్చుకున్నవారు సంఘవి, మహేశ్వరి లాంటివారు ఉన్నారు. ఈక్రమంలో .. వారంతా మళ్లీ ఏదో ఒక రకంగా తెరపై మళ్ళీ కనిపించాలని ఆరాటపడుతున్నారు. బుల్లితెరపై సీరియల్లు.. షోలు, వెబ్ సిరీస్ లతో సందడిచేస్తున్నారు. ఈక్రమంలో హీరోయిన్ సంఘవి కూడా ఈమధ్య ఎక్కువగా టాలీవుడ్ షోలలో కనిపిస్తుంది. రీసెంట్ గా ఓ షోలో సందడి చేసిన సంఘవి.. యాక్టర్ ఫృధ్వీపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

90స్ హీరో, హీరోయిన్స్ జాబితా చాలా పెద్దది. అయితే వీరిలో నటీమణులు మీనా, ప్రీతా, సంఘవి, సంగీత, మహేశ్వరిలు ఎప్పటికప్పుడు కలుసుకుంటూనే ఉంటారు. ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా వీరంతా కలుసుకున్నారు. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సంఘవి ప్రముఖ నటుడు, విలన్ బబ్లూ పృధ్వీ రాజ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తనను మోసం చేశారంటూ వాపోయారు. అతను చేసిన మోసం త్వరగా తెలిసిపోయిందని చెప్పారు.

సంఘవి మాట్లాడుతూ.. ఓ రోజు షూటింగ్ కంప్లీట్ చేసుకుని నైట్ వస్తున్నాము.. అంతలో పృధ్వీ వచ్చి నా వైఫ్ ప్రెగ్నెంట్. కనీసం వీళ్లు కేక్ అడిగితే ఇవ్వడం లేదు అన్నాడు. నేను చాలా సీరియస్‌గా రెస్టారెంట్‌కు వెళ్లి పోయి.. కేక్ ప్యాక్ చేయించి ఇచ్చాను. తర్వాత ఎయిర్ పోర్టులో తనని, తన వైఫ్‌ను చూశాను అప్పుడే తెలిసింది ఆమె ప్రెగ్నంట్ కాదు అని. అయితే అసలు విషయం తెలియకు నేను  వెళ్లి అడిగాను. దాంతో ఫృధ్వీ బండారం బయట పడింది అన్నారు. 

ప్రస్తుతం ఎన్నో నెల అని ఆమెను అడిగాను. అదేంటి.. అన్నట్టు ఎక్స్ ప్రెషన్స్ పెట్టింది ఆమె. దాంతో విషయం అర్ధంఅయ్యింది.  ప్రెగ్నెంట్ కాకపోయినా..అబద్దం చెప్పి ఆయన కేక్ తీసుకెళ్లారు అని సంఘవి చెప్పింది. దాంతో వెంటనే అందుకున్న మహేష్వరి..  ఒక వేళ  ఆయన ప్రెగ్నేంటేమో అని సరదా కామెంట్ చేసేవరకు.. అక్కడ అంతా నవ్వులు పూశాయి. 

ఇక ప్రస్తుతం 80స్.. 90స్ స్టార్స్ అంతా మళ్లీ తెరపై కనిపించడానికి ఇష్టపడుతున్నారు. సినిమాలో ఫేడ్ అయిన స్టార్లంతా మళ్లీ వెండి తెరపై కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఖుష్బు, ఇంద్రజ, కస్తూరి, రాధ లాంటి హీరోయిన్లు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. టీవి ప్రోగ్రామ్స్.. లేదా స్పెషల్ షోలకు జడ్జిలుగా.. లేకపోతే సీరియల్ లోలీడ్ పాత్రలుగా కనిపిస్తున్నారు కొంత మంది వెబ్ సిరీస్ ల వైపు వెళ్తున్నారు. 

ఇక అందులో.. కస్తూరి సీరియల్స్‌తో బిజీ కాగా, అర్చన ఓ సినిమాతో మెరిశారు. అలాగే రాధ ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా అలరించారు. నదియా, మీనా, రాశి, సిమ్రాన్, ప్రేమ, జ్యోతిక వీరంతా ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. నటి లయ చాలా రోజుల తర్వాత కనిపించింది. ఆమె కూడా సినిమాల్లో నటించేందుకు రెడీ అయ్యింది. ఇలా అప్పటి స్టార్స్ మళ్ళీ నటన మొదలు పెడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు