నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ Nani30. ఈ చిత్రం నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ అందింది. చిత్ర రిలీజ్ డేట్ ను కన్ఫమ్ చేస్తూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ అందించారు.
సినిమాల పరంగా నాని ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నారు. హిట్లు, ఫ్లాప్స్ సంగతి పక్కనెడితే కొత్త డైరెక్టర్లతో విభిన్న పాత్రలు పోషిస్తూ ఆడియెన్స్ ముందుకు సరికొత్త సినిమాలను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా Dasara చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు నాని. మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం సక్సెస్ జోరులో ఉన్న నాని నెక్ట్స్ సినిమా అప్డేట్స్ ను అందించారు.
తాజాగా Nani30 నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ అందించారు. నేచురల్ స్టార్ నాని - మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శక్తవం వహిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే రెగ్యూలర్ షూటింగ్ కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా సినిమా నుంచి సాలిడి అప్డేట్ అందించారు. ‘నాని30’వ చిత్ర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 2023 డిసెంబర్ 21న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే క్రిస్మస్ కు భారీ చిత్రాలేవి విడుదల కావడం లేదు. ఇప్పటికే చిరంజీవి ‘భోళా శంకర్’, ప్రభాస్ ‘ఆదిపురుష్’, ‘సలార్’ సెప్టెంబర్ వరకే ముగిసిపోతున్నాయి. 2024 జనవరి 13 నుంచి మళ్లీ భారీ చిత్రాలు ప్రారంభం కానున్నాయి. ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’, ‘పుష్ప2’, మహేశ్ బాబు SSMB28 కూడా వచ్చే ఏడాదికే లాక్ అయ్యాయి. ఈక్రమంలో నాని మాస్టర్ ప్లాన్ తో క్రిస్మస్ సెలవులకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా గురువారం విడుదల కాగా, క్రిస్మస్ సోమవారం వస్తుంది. కాబట్టి, మొదటి మరియు దీర్ఘ వారాంతపు సంఖ్యలు భారీగా ఉండబోతున్నాయి. కానీ డిసెంబర్ 22న వెంకటేశ్ ‘సైంధవ్’ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నాని, వెంకటేశ్ చిత్రాలు క్లాష్ అయ్యాయి. దీంతో మళ్లీ డేట్ మార్చే అవకాశం ఏమైనా ఉందా? లేదంటే దీనికే ఫిక్స్ అవుతారా అన్నది చూడాలి.
చిత్రం ప్రత్యేకమైన కథాంశంతో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో నాని తన ఆన్-స్క్రీన్ కూతురిని ఆప్యాయంగా కౌగిలించుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో నాని సహా ప్రముఖ తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రంలో కొంతమంది యువకులు మరియు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు విభిన్నమైన క్రాఫ్ట్‌లను చూసుకుంటారు. ప్రముఖ మలయాళ స్వరకర్త ‘హృదయం’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. సాను జాన్ వరుగీస్ డివోపీగా వర్క్ చేస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఈవీవీ సతీష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
2023 had to end with a celebration 💙
DECEMBER 21st :) pic.twitter.com/pFQTbAXF6e