సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ (Simran) తన చెల్లిలిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. 20 ఏండ్ల కిందనే కొల్పోయిన తన సోదరి గురించి ఓ పోస్టు పెట్టారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటి సిమ్రాన్. 1999 నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో యాక్టివ్ గానే ఉంటోంది. 1976 ఏప్రిల్ 4న ముంబైలో జన్మించిన సిమ్రాన్ తొలుత తమిళ చిత్రాల్లో సెటిల్ అయ్యారు. ఆమెకు చెల్లెలు మోనల్ (Monal) కూడా ఉండేవారు. సిమ్రాన్ చెల్లెలిగా మోనల్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళం, తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగులో కేవలం ‘ఇష్టం’ అనే చిత్రంలోనే నటించింది. అయితే సరిగ్గా 21 ఏండ్ల కింద మోనల్ సూసైడ్ చేసుకున్నారు. 2002 ఏప్రిల్ 14న 21 ఏండ్ల వయస్సులోనే ఆత్మహత్య చేసుకుంది.
నిన్న మోనల్ చనిపోయిన రోజు కావడంతో సిమ్రాన్ ఎమోషనల్ అయ్యారు. చెల్లెల్ని గుర్తు చేసుకుంటూ హృదయాన్ని కదిలించేలా ఓ పోస్టు పెట్టింది. ‘నా అందమైన సోదరి మోనాల్ ప్రేమపూర్వక జ్ఞాపకార్థం. నిన్ను ఎప్పటికీ మరచిపోలేను’ అంటూ తన పంచుకున్న ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఫొటోల్లో సిమ్రాన్ తనచెల్లి మోనాల్ తో ఉంది. చైల్డ్ హుడ్ ఫొటోతో పాటు తమ యంగ్ ఏజ్ లోని పిక్స్ ను జతచేసి పంచుకుంది. ఆ ఫొటోను చూసిన నెటిజన్లు కూడా ఎమోషనల్ అవుతున్నారు. సిమ్రాన్ ను ఓదార్చేలా కామెంట్లు పెడుతున్నారు.
సీనియర్ హీరోయిన్ గా ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. తనకు తగిన పాత్రల్లో నటిస్తూ ఫ్యాన్స్, ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ సీనియర్ భామా తెలుగులోనూ సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ లో చెరగని ముద్ర వేసుకున్నారు. సమరసింహ రెడ్డి, కలిసుందాం రా, నర్సింహ నాయుడు, డాడీ, సీతయ్య, ఒక్క మొగుడు’ వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం కూడా సీనియర్ నటిగా అవకాశాలు అందుకుంటోంది.
తెలుగులో చిత్రాలు చేయకపోయినా.. హిందీ, తమిళంలో వరుసపెట్టి సినిమాల్లో నటిస్తోంది. చివరిగా చియాన్ విక్రమ్ నటించిన ‘మహాన్’, మాధవ్ నటించిన ‘రాక్రెట్రీ’ చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలు తెలుగులోనూ డబ్ వెర్షన్ లో విడుదలై ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం తమిళ చిత్రలతోనే బిజీగా ఉంది. తమిళంలో ‘శబ్ధం’,‘అందగన్’,‘ధ్రువ నక్షత్రం’,‘వనంగముడి’ చిత్రాల్లో నటిస్తూ సిమ్రాన్ బిజీగా ఉంది.
In loving memory of my beautiful sister Monal. You’ll be never forgotten 😘 pic.twitter.com/4E78Ol6PZz
— Simran (@SimranbaggaOffc)