NTR New Movie : ఎన్టీఆర్ సినిమాలో హీరో రాజశేఖర్.. ఏ పాత్ర చేయబోతున్నాడంటే..?

By Mahesh Jujjuri  |  First Published Jan 11, 2022, 7:14 AM IST

త్వరలో కొత్త సినిమా సెట్స్ ఎక్కించబోతున్నాడు ఎన్టీఆర్(NTR). ట్రిపుల్ ఆర్(RRR) ఇక ఇప్పట్లో రిలీజ్  అవుతందో లేదో అని కొరటాల సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరో రాజశేఖర్(Rajasekar) కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారట.


త్వరలో కొత్త సినిమా సెట్స్ ఎక్కించబోతున్నాడు ఎన్టీఆర్(NTR). ట్రిపుల్ ఆర్(RRR) ఇక ఇప్పట్లో రిలీజ్  అవుతందో లేదో అని కొరటాల సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరో రాజశేఖర్(Rajasekar) కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారట.

 టాలీవుడ్ లో హీరోలుగా ఓ వెలుగు వెలిగిన హీరోలంతా క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్ళుతున్నారు. అయితే ఇంకా కొంత మంది సీనియర్ స్టార్స్ మాత్రం హీరోలుగానే కొనసాగుతున్నారు. అందులో యాంగ్రీ హీరో రాజశేఖర్ Rajasekar కూడా ఒకరు. ఈ మధ్య ఆయన నటించిన గరుడవేగ,కల్కీ లాంటి సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి.త్వరలో శేఖర్ మూవీతో డిఫరెంట్ లుక్ లో రాబోతున్నాడు.

Latest Videos

ఇక ఈ స్టార్ హీరో ఇటు హీరోగా చేస్తూనే పవర్ ఫుల్ పాత్రలు.. విలన్ పాత్రలు చేయడానికి రెడీ అని చాలా కాలం క్రితం చెప్పాడు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చింది. రాజశేఖర్. ఎన్టీఆర్(NTR) సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.  అది కూడా ఎన్టీఆర్ కు బాబాయిగా నటించబోతున్నాడట రాజ శేఖర్ (Rajasekar). ఈ సినిమాలో కథను గట్టిగా ప్రభావితం చేసే పాత్ర ఇది అని సమాచారం.

ప్రస్తుతం రాజశేఖర్ (Rajasekar) హీరోగా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాంటిది ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి ఎలా ఒప్పుకుంటారు అని డిస్కర్షన్ ఇండస్ట్రీలో నడుస్తుంది. అయితే ఈ సిమాలో ఎన్టీఆర్(NTR) బాబాయిగా.. ఈ పాత్రలో రాజశేఖర్ మాత్రమే కరెక్ట్ గా సూట్ అవుతారని కొరటాల ఫిక్స్ అయ్యాడటం. అందుకే ఎలాగైనా ఆయన్ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారట టీమ్. దాదాపు రాజశేఖర్(Rajasekar) కూడా... ఈ క్యారెక్టర్ చేయడానికి ఓప్పుకున్నట్టే తెలుస్తుంది. ఈ కాంబినేషన్ కలిస్తే మాత్రం వెండితెరపై సరికొత్త కలయిక సందడి చేసినట్టే.

ట్రిపుల్ ఆర్(RRR)  రిలీజ్ వుతుందేమో అని ఆశగా ఎదురు చూశాడు ఎన్టీఆర్(NTR).. కాని కరోనా వల్ల గట్టి దెబ్బే తగిలింది. ఇప్పటికే ఫ్యాన్స్ కు దూరమై మూడేళు అవుతుంది. 2018 తరువాత ఎన్టీఆర్ సినిమా రాలేదు. అందుకే ఇక లేట్ చేయకుండా కొరటాల సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు తారక్. ఈ ఏడాది రెండు సినిమాలు కంప్లీట్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు.

అటు కొరటా శివ ఆచార్య రిలీజ్ అయిన తరువాత ఎన్టీఆర్(NTR) మూవీని పిబ్రవరిలో కాని మార్చిలో కాని స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. కాని తారక్  ప్రీ అవ్వడంతో వెంటనే స్టార్ట్ చేసి దసరా లోపు సినిమా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ ఏడాదే ఎన్టీఆర్ .. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక కొరటాలతో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయట.హీరోయిన్ గా కియారా అద్వాని దాదాపు ఫిక్స్ అయినట్టే  అంటున్నారు.

Also Read : నానికి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్‌.. `శ్యామ్‌ సింగరాయ్‌` గురించి ఏమన్నాడంటే?
 

click me!