సమంతపై రకుల్ హాట్ కామెంట్స్.. 'పుష్ప' గురించి ఏం చెప్పిందంటే..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 10, 2022, 08:27 PM IST
సమంతపై రకుల్ హాట్ కామెంట్స్.. 'పుష్ప' గురించి ఏం చెప్పిందంటే..

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ చేసిన పాన్ ఇండియా ప్రయత్నం పుష్ప మంచి ఫలితాన్నే ఇచ్చింది. ముఖ్యంగా హిందీలో పుష్ప చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. అల్లు అర్జున్ నటన, స్మగ్లర్ గా మొరటు యాటిట్యూడ్, యాక్షన్ అంశాలు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ చేసిన పాన్ ఇండియా ప్రయత్నం పుష్ప మంచి ఫలితాన్నే ఇచ్చింది. ముఖ్యంగా హిందీలో పుష్ప చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. అల్లు అర్జున్ నటన, స్మగ్లర్ గా మొరటు యాటిట్యూడ్, యాక్షన్ అంశాలు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి.  పుష్ప చిత్రంపై సెలెబ్రిటీల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పుష్ప చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసింది. అల్లు అర్జున్ పై ఒక రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించింది. 'పుష్ప.. ఉఫ్.. విజిల్ కొట్టించే స్టైల్, క్రేజ్.. నా ఫేవరిట్ అల్లు అర్జున్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్.. ఇలాంటి పాత్రలు నువ్వు మరిన్ని చేయాలి. సుకుమార్ సర్ ప్రతి సారి కొత్త ప్రపంచం సృష్టిస్తారు. రష్మిక అద్భుతంగా నటించింది అందంగా కనిపించింది. ఇక సమంత.. ఆమె గురించి ఏం చెప్పను.. సమంత హాట్ నెస్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. ఫహద్ ఫాజిల్ ఇంటెన్స్ గా నటించారు. పుష్ప చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అంటూ రకుల్ పోస్ట్ పెట్టింది. రకుల్ అల్లు అర్జున్ సరసన సరైనోడు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ వైవిధ్యమైన నటనతో అదరగొట్టాడు. ఇక రష్మిక పల్లెటూరి యువతిగా కట్టిపడేసింది. ఈ చిత్రంలో సమంత తొలిసారి ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఐటెం సాంగ్ లో సామ్ హాట్ గా కనిపించింది అంటూ రకుల్ కామెంట్స్ చేసింది. 

అజయ్ ఘోష్, అనసూయ, రావు రమేష్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. పార్ట్ 2 లో ఫహద్ ఫాజిల్ ప్రధాన విలన్ గా కనిపించబోతున్నాడు. పార్ట్1 చివర్లో అల్లు అర్జున్.. ఫహద్ ఫాజిల్ తో గొడవ పెట్టుకోవడంతో పార్ట్ 2పై ఆసక్తి పెంచారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: జ్యోతో ఓ రేంజ్ లో ఆడుకున్న సూరజ్- మాలిని కుట్ర- అసలు మాలిని ఎవరంటే?
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ టీమ్ కు షాక్ ఇచ్చిన నాగార్జున, కింగ్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ డిమాండ్, నిజమెంత?