భార్యతో కలిసి ఓటు వేసి సామాజిక బాధ్యతని చాటుకున్న సీనియర్‌ నటుడు కోటశ్రీనివాసరావు

Published : Dec 01, 2020, 01:17 PM ISTUpdated : Dec 01, 2020, 01:23 PM IST
భార్యతో కలిసి ఓటు వేసి సామాజిక బాధ్యతని చాటుకున్న సీనియర్‌ నటుడు కోటశ్రీనివాసరావు

సారాంశం

సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు ఓటు వేశారు. ఆయన ఈ వయసులో కూడా ఆయన ఓటు వేసేందుకు తన భార్యతో కలిసి రావడం విశేషం. ఓటుకు ఉన్న విలువని, దాన్ని ప్రాధాన్యతని చాటుకున్నారు. ఓటు వేసినట్టు ఆయన వేలిని కూడా చూపించడం మరో విశేషం.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌లో హైదరాబాద్‌ ప్రజలు మందకోడిగా ఓట్‌ వేసేందుకు వస్తుంటే, సీనియర్లు, వృద్ధులు ఉత్సాహంతో ఓటు వేసేందుకు ముందుకు రావడం విశేషం. తాజాగా సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు ఓటు వేశారు. ఆయన ఈ వయసులో కూడా ఆయన ఓటు వేసేందుకు తన భార్యతో కలిసి రావడం విశేషం. ఓటుకు ఉన్న విలువని, దాన్ని ప్రాధాన్యతని చాటుకున్నారు. ఓటు వేసినట్టు ఆయన వేలిని కూడా చూపించడం మరో విశేషం. కోటశ్రీనివాస్‌రావు ఫిల్మ్ నగర్‌లోని ఎఫ్‌ఎన్ సీసీలో ఓటు వేశారు. 

ఇక ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, రాజేంద్రప్రసాద్‌ ఫ్యామిలీ, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, మంచు లక్ష్మీ, పరుచూరి గోపాలకృష్ణ, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, వందేమాతరం శ్రీనివాస్‌, ఝాన్సీ వంటి వారు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. తమ బాధ్యతని చాటుకున్నారు. అయితే ఓటు వేసేందుకు జనాలు పెద్దగా రాకపోవడపై రాజేంద్రప్రసాద్‌ అవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Ramayana: రామాయణ్‌పై టాక్సిక్‌ డిజాస్టర్‌ దెబ్బ, ప్రమోషన్‌లో వెనుకబాటు.. సైలెన్స్ కి కారణం ఇదేనా?
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌