ఓటు వేయకపోవడం నేరం.. నిద్ర లేవండి..ఓటు వేయండిః రాజేంద్రప్రసాద్‌

Published : Dec 01, 2020, 10:38 AM IST
ఓటు వేయకపోవడం నేరం.. నిద్ర లేవండి..ఓటు వేయండిః రాజేంద్రప్రసాద్‌

సారాంశం

`ఓటు వేయడం మన హక్కు. ఓటు వేయకపోవడం నేరం. ప్రతి ఒక్కరు వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలి` అని నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఆయన పదిగంటల సమయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్య, కుమారుడితో కలిసి ఓటు వేశారు. యాంకర్‌, నటి ఝాన్సీ సైతం ఓట్‌ని వినియోగించుకున్నారు.

`ఓటు వేయడం మన హక్కు. ఓటు వేయకపోవడం నేరం. ప్రతి ఒక్కరు వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలి` అని నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఆయన పదిగంటల సమయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్య, కుమారుడితో కలిసి ఓటు వేశారు.  ఈ సందర్భంగా ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తాను అరకు నుంచి వచ్చి ఓట్‌ వినియోగించుకున్నట్టు తెలిపారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ, `పోలింగ్‌ ఇంత మందకోడిగా జరగడం బాధగా ఉంది. ఓటు వేసేందుకు ఇంకా ముందుకు రాకపోవడం విచారకరం. ఓటు అనేది మన అందరి హక్కు. ప్రశ్నించే హక్కు. ఓటు వేసిన వాడే ప్రశ్నించే హక్కు ఉంటుంది. లేకపోతే సమస్యలను ప్రశ్నించే హక్కు లేదు. ఎవరి కోసమో మనం ఓటు వేయడమేంటనే ఆలోచన నుంచి బయటపడండి. ఓటు వేయడమంటే వ్యవస్థని నిలబెట్టడం, వ్యవస్థకి విలువ ఇవ్వడం. నన్ను చూసైనా నలుగురు ఓటు వేయడానికి వస్తారని ఆశిస్తున్నా. ఇంకా టైమ్‌ ఉంది. నిద్ర లేవండి.. లేచి రండి.. ఓటు వేయండి` అని రాజేంద్రప్రసాద్‌ అన్నారు. 

నటి, యాంకర్‌ ఝాన్సీ కూడా ఓటుని వినిపియోగించుకున్నారు. ఇప్పటికే చిరంజీవి, సురేఖ, నాగార్జున, తేజ, మంచు లక్ష్మీ, పరుచూరి బ్రదర్స్, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి వంటి వారు ఓట్‌ని వినిపించుకున్న విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?