తెలుగు రాష్ట్రాల్లో తమిళ షూటింగ్స్ వద్దు, మంత్రి రోజా భర్త ఆర్ కే సెల్వమణి కీలక వ్యాఖ్యలు

Published : May 05, 2022, 11:11 AM IST
తెలుగు రాష్ట్రాల్లో తమిళ షూటింగ్స్ వద్దు, మంత్రి రోజా భర్త ఆర్ కే సెల్వమణి కీలక వ్యాఖ్యలు

సారాంశం

ఏపీ మంత్రి రోజా భర్త, తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగులకు సంబంధించి  కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, వైజాగ్ లలో సినిమా షూటింగులు ఆపేయాలని ఆయన తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలను కోరారు.   

ఏపీ మంత్రి రోజా భర్త, తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగులకు సంబంధించి  కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, వైజాగ్ లలో సినిమా షూటింగులు ఆపేయాలని ఆయన తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలను కోరారు. 

పక్క రాష్ట్రాల్లో షూటింగులు జరపడం వల్ల తమిళ ఇండస్ట్రీకి చెందిన వేలాది మంది సినీ కార్మికులు చాలా నష్టపోతున్నారని ఆర్ కే సెల్వమణి అంటున్నారు.  తమిళ పరిశ్రమకు చెందిన పెద్ద హీరోలు తమిళనాడలో  కాకుండా పక్క రాష్ట్రాల్లోని హైదరాబాద్, వైజాగ్ లలో షూటింగులు చేస్తున్నారని, .. దీని వల్ల తమిళ సినీ కార్మికులకు భారీగా నష్టం జరుగుతోందని అన్నారు. కథ డిమాండ్ మేరకు షూటింగులు ఎక్కడ జరుపుకున్నా అభ్యంతరం లేదన్నారు. 

అయితే సెక్యూరిటీ రీజన్స్ ను  భద్రతను సాకుగా చూపుతూ పొరుగు రాష్ట్రాల్లో షూటింగులు జరపడం సరికాదని చెప్పారు.  దేశంలోనే అతి పెద్దది, ఆసియాలోనే రెండో అతిపెద్ద ఫ్లోర్ ను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాగే ఎత్తైన ప్రహరీ గోడతో 15 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణం ఉందని చెప్పారు. అక్కడ ఎలాంటి భయం లేకుండానే షూటింగులు చేసుకోవచ్చని అన్నారు  సెల్వమణి.

చెన్నైలో షూటింగులకు అవసరమైన అన్ని వసతులు, సౌకర్యాలు, రక్షణ వ్యవస్థలు ఉన్నాయన్నరు సెల్వమణి. తమిళనాడులోనే షూటింగులు జరుపుకోవాలనే తమ రిక్వెస్ట్  పట్ల స్టార్  హీరో విజయ్ సానుకూలంగా స్పందించారని సెల్వమణి అన్నారు. అజిత్ కూడా  ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నారన్నరు సెల్వమణి. 

ముఖ్యంగా  అజిత్ ప్రతి సినిమా షూటింగ్  హైదరాబాదులోనే చిత్రీకరణ జరుపుకుంటోందని... దీని వల్ల తమిళ సినీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్వమణి ప్రస్తుతం ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెప్సి)కి అధ్యక్షుడుగా, తమిళనాడు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం