Aditi Rao Hydari: లగ్జరీ కారు కొన్న వరుణ్ తేజ్ హీరోయిన్.. వామ్మో ధర చుక్కల్లో ఉందే.. 

Published : May 05, 2022, 08:59 AM IST
Aditi Rao Hydari: లగ్జరీ కారు కొన్న వరుణ్ తేజ్ హీరోయిన్.. వామ్మో ధర చుక్కల్లో ఉందే.. 

సారాంశం

అందాల భామ అదితి రావు హైదరి గురించి పరిచయం అవసరం లేదు. నటిగా టాలీవుడ్ లో ఆమె ఫుల్ మార్క్స్ కొట్టేసింది. అవకాశం వచ్చినప్పుడల్లా తనని తానూ నిరూపించుకుంటోంది.

అందాల భామ అదితి రావు హైదరి గురించి పరిచయం అవసరం లేదు. నటిగా టాలీవుడ్ లో ఆమె ఫుల్ మార్క్స్ కొట్టేసింది. అవకాశం వచ్చినప్పుడల్లా తనని తానూ నిరూపించుకుంటోంది. ఆమె కెరీర్ లో పెద్దగా విజయాలు లేకపోవడమే మైనస్ గా మారింది. 

కానీ అదితి రావుకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అదితి చివరగా మహాసముద్రం అనే క్రేజీ మూవీలో నటించింది. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ నిరాశపరిచింది. ప్రస్తుతం అదితికి అన్ని భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. సెలెబ్రెటీలకు కార్లపై మోజు ఉండడం సహజమే. తాజాగా అదితి కూడా తన కోరిక నెరవేర్చుకుంది. 

ఓ లగ్జరీ కారుని ఆమె కొనుగోలు చేసింది. అత్యంత ఖరీదైన ఆడి క్యూ 7 సిరీస్ మోడల్ ని ఆమె కొనుగోలు చేశారు.దీనితో ఆడి సంస్థ అదితి కొనుగోలు చేసిన కారు పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెకు కంగ్రాట్స్ తెలిపింది. ఇంతకీ అదితి కొన్న ఈ కారు ధర ఎంతంటే.. అక్షరాలా రూ. 90 లక్షలు. 

బ్లూ కలర్ లో ఉన్న ఈ కారు ఆకర్షణీయంగా ఉంది. తన ఆడి కారుతో ఉన్న అదితి రావు హైదరి ఫోటోలు వైరల్ గా మారాయి. అదితి రావు తెలుగులో వరుణ్ తేజ్ సరసన అంతరిక్షం అనే చిత్రంలో నటించింది. ఆ మూవీలో అదితి నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే సమ్మోహనం, వి లాంటి చిత్రాల్లో కూడా నటించింది. 

 

 

PREV
click me!

Recommended Stories

VD14: విజయ్‌ దేవరకొండ వీడీ 14 నుంచి గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌.. రౌడీ బాయ్స్ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చినట్టే
రెమ్యునరేషన్ లేకుండా మహేష్ చేసిన సినిమా ఏదో తెలుసా.? హీరోగా చేసింది పవన్ కళ్యాణ్..