
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ నటిస్తున్న కంప్లీట్ మాస్ మూవీ ఇదే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. మహేష్ బాబు ఫుల్ ఎనెర్జిటిక్ గా కామెడీ, మాస్ యాక్షన్ తో అదరగొడుతున్నారు.
మహేష్ బాబు చివరగా 'సరిలేరు నీ కెవ్వరు' అనే చిత్రంలో నటించారు. అది కూడా మాస్ అంశాలు ఉండే చిత్రమే. కానీ ఎక్కడో చిన్న వెలితి కనిపించింది. ఆ లోటుని భర్తీ చేయడానికి సర్కారు వారి పాటతో మహేష్ బాబు మే 12న థియేటర్స్ లో ల్యాండ్ కాబోతున్నాడు.
తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 7న నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించనున్నారు.
దీనితో మహేష్ అభిమానులు సినిమా రిలీజ్ కు ముందు సెలెబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు పరశురామ్ నుంచి వస్తున్న చిత్రం ఇదే. ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండడంతో సినిమా పక్కాగా అలరిస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.