'సవ్యసాచి' ట్విట్టర్ రివ్యూ..!

Published : Nov 02, 2018, 09:40 AM IST
'సవ్యసాచి' ట్విట్టర్ రివ్యూ..!

సారాంశం

అక్కినేని నాగచైతన్య హీరోగా దర్శకుడు చందు మొండేటి 'సవ్యసాచి' అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ చైతు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మాధవన్ విలన్ పాత్రలో నటించారు. 

అక్కినేని నాగచైతన్య హీరోగా దర్శకుడు చందు మొండేటి 'సవ్యసాచి' అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ చైతు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మాధవన్ విలన్ పాత్రలో నటించారు. భూమిక కీలకపాత్రలో నటించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.

దర్శకుడు చందు మొండేటి వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అన్న పాయింట్‌తో 'సవ్యసాచి' కథను అద్భుతంగా తీర్చిదిద్దాడని.. రొటీన్ కథల్లా కాకుండా ఓ డిఫరెంట్ మూవీ చూశామన్న అనుభూతి ఈ చిత్రం ద్వారా కలుగుతుందని కొందరు ట్వీట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఈ సినిమాపై పెదవి విరుస్తున్నారు. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. నేరేషన్ పాతదే అంటూ తేల్చేశారు.

అయితే చైతూ కెరియర్‌లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారని.. ఈ చిత్రంలో టాలీవుడ్‌కి పరిచయమైన నిధి అగర్వాల్ గ్లామర్ షోతో ఆకట్టుకుందంటున్నారు. మాధవన్ యాక్షన్ ఈ చిత్రానికే హైలైట్ కాగా.. చైతూ-మాధవన్ కాంబినేషన్ సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయంటున్నారు. మొత్తానికి ఈ సినిమాకి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

 

 

ఇవి కూడా చదవండి.. 

సవ్యసాచి యూఎస్ ప్రీమియర్ షో టాక్!

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?
Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం