అఖిల్ ఫెవరెట్ సినిమా.. పవర్ స్టార్ స్టైల్ దించేశాడట!

Published : Nov 01, 2018, 08:43 PM IST
అఖిల్ ఫెవరెట్ సినిమా.. పవర్ స్టార్ స్టైల్ దించేశాడట!

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సూపర్ స్టార్ మహేష్ బాబుకి అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో చెప్పడం కష్టమే. సినీ ప్రముఖులు కూడా వీరి స్టార్ డమ్ చూసి అభిమానులుగా మారిపోతుంటారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సూపర్ స్టార్ మహేష్ బాబుకి అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో చెప్పడం కష్టమే. సినీ ప్రముఖులు కూడా వీరి స్టార్ డమ్ చూసి అభిమానులుగా మారిపోతుంటారు. అయితే సినీ వారసులు చాలా వరకు వారి ఫ్యామిలీలో ఉండే నటీనటులనే అభిమాన తరాలని చెప్పుకుంటూ ఉంటారు. 

అసలు విషయంలోకి వస్తే అక్కినేని వారసుడు మాత్రం అలా కాదండోయ్.. తన మనస్సులో ఉన్నదీ ఉన్నట్టుగా వేరే స్టార్స్ కి ఫ్యాన్ అని చెప్పేస్తుంటాడు. ముందు నుంచి మెగాస్టార్ చిరంజీవి - సూపర్ స్టార్ మహేష్ లే తన అభిమాన హీరోలను చెబుతన్నాడు. ఇక రీసెంట్ గా తనకు ఎంతో ఇష్టమైన సినిమా గురించి కూడా అఖిల్ బయటపెట్టేశాడు. 

నాగార్జున - ఏఎన్నార్ సినిమాలని చెప్పకుండా పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది  సినిమా చాలా ఇష్టమని ఇటీవల చెప్పాడు. అంతే కాకుండా సినిమాలో కొన్ని సన్నివేశాల ఆధారంగా తన నెక్స్ట్ సినిమా mr.మజ్నులో ఉంటాయని చెబుతున్నాడు. ఆ సినిమాలో పవన్ స్టైల్ అంటే అఖిల్ కు చాలా ఇష్టమట. ఇక అఖిల్ సినిమాలో ఆ స్టైల్ ను అనుకరించినట్లు టాక్ వస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను బివిఎస్ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

పొగరు అనుకున్నా పర్లేదు.! రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ఆఫర్ అందుకే రిజెక్ట్ చేశా
Chiranjeevi: చిరంజీవితో పోటీ, అది నచ్చకే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయా.. నిజాలు బయటపెట్టిన క్రేజీ హీరో