కలెక్షన్స్: సవ్యసాచి కంటే శైలజా రెడ్డి అల్లుడే బెటర్ కదా..!

Published : Nov 05, 2018, 05:02 PM IST
కలెక్షన్స్: సవ్యసాచి కంటే శైలజా రెడ్డి అల్లుడే బెటర్ కదా..!

సారాంశం

అక్కినేని వారసుడు నాగ చైతన్య యాక్షన్ కథలతో హిట్టు కొట్టాలని గత కొంత కాలంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అతను అనుకున్న రేంజ్ లో మాత్రం ఆ ఫార్మాట్ సక్సెస్ అవ్వడం లేదు. రీసెంట్ గా విడుదలైన సవ్యసాచి సినిమా భారీ అంచనాలతో రిలీజయిన సంగతి తెలిసిందే. 

అక్కినేని వారసుడు నాగ చైతన్య యాక్షన్ కథలతో హిట్టు కొట్టాలని గత కొంత కాలంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అతను అనుకున్న రేంజ్ లో మాత్రం ఆ ఫార్మాట్ సక్సెస్ అవ్వడం లేదు. రీసెంట్ గా విడుదలైన సవ్యసాచి సినిమా భారీ అంచనాలతో రిలీజయిన సంగతి తెలిసిందే. అయితే సినిమా మాత్రం అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయింది అనే టాక్ వస్తోంది. 

ఇకపోతే సినిమాకు సంబందించిన కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి వారం సవ్యసాచి శైలజా రెడ్డి అల్లుడి కంటే తక్కువే వసూలు చేసింది. మారుతీ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఫస్ట్ వీకెండ్ (నాలుగు రోజుల్లో) షేర్స్ 14కోట్ల వరకు అందుకుంది. ఇక సవ్యసాచి షేర్స్ మాత్రం మొదటి వారం(మూడు రోజుల్లో) పది కోట్లు కూడా దాటాకపోవడం  గమనార్హం. 

సినిమా థ్రియేటికల్ రైట్స్ 22.5కోట్లకు అమ్ముడుపోగా సినిమా మొదటి వారమే 70% షేర్స్ రికవర్ చేస్తుందని టాక్ వచ్చింది. కానీ సినిమా ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో ఓపెనింగ్ కలెక్షన్స్ డల్ అయ్యాయి. ఫస్ట్ వీకెండ్ 7.65కోట్ల షేర్స్ ను మాత్రమే సవ్యసాచి అందుకుంది. ఇక దీపావళి సెలవుల్లో సినిమా కొంతవరకు కలెక్షన్స్ ను రాబడితే బయ్యర్స్ సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?
OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్