వెన్నులో వణుకు పుట్టిస్తున్న 'పొలిమేర 2' టీజర్.. ఈసారి డోస్ పెంచారుగా..

Published : Jun 30, 2023, 09:39 PM IST
వెన్నులో వణుకు పుట్టిస్తున్న 'పొలిమేర 2' టీజర్.. ఈసారి డోస్ పెంచారుగా..

సారాంశం

కంటెంట్ వైవిధ్యంగా ఉంటే వెండితెరపై అయినా.. ఓటిటిలో అయినా చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఈ విషయాన్ని కొన్ని చిన్న చిత్రాలు కూడా నిరూపించాయి. అందులో ఒకటి పొలిమేర చిత్రం.

కంటెంట్ వైవిధ్యంగా ఉంటే వెండితెరపై అయినా.. ఓటిటిలో అయినా చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఈ విషయాన్ని కొన్ని చిన్న చిత్రాలు కూడా నిరూపించాయి. అందులో ఒకటి పొలిమేర చిత్రం. 2021లో ఈ చిత్రం ఓటిటిలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. క్షుద్ర పూజలు, తంత్రాలు లాంటి వైవిధ్యమైన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

ఇటీవల ఇలాంటి అంశంతోనే విడుదలైన విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామి సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు పొలిమేర 2 కూడా వస్తుండడంతో దీనిపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.  ఆ మధ్యన విడుదలైన పొలిమేర 2 ఫస్ట్ లుక్ తెగ వైరల్ అయింది. కమెడియన్ సత్యం రాజేష్ క్షుద్ర మాంత్రికుడిగా నగ్నంగా కనిపించడంతో షాక్ అయ్యారు. 

తాజాగా నేడు ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. ఒళ్ళు గగుర్పాటుకు గురిచేసే అంశాలు మొదటి భాగాన్ని మించేలా పార్ట్ 2 లో ఉండబోతున్నట్లు టీజర్ తో అర్థం అవుతోంది. ఈ చిత్రంలో  సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవివర్మ లాంటి వాళ్ళు నటిస్తున్నారు. 

టీజర్ మొత్తం ఉత్కంఠ పెంచేలా ఉంది. చివర్లో 'ప్రాణం తీసుడు తప్పు కాదా మామా ' అని అంటే.. 'ప్రాణం తీసుడు తప్పుకాని బలిస్తే తప్పేంది' అనే డైలాగ్ ఈ చిత్రం థీమ్ ని వివరించేలా ఉంది. అలాగే సత్యం రాజేష్ క్షుద్రపూజలు చేస్తూ తలపై రక్తం పోసుకుంటున్న దృశ్యాలు థియేటర్స్ లో మరింత భయపెట్టడం ఖాయం. 

అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశేషం ఏంటంటే ఈ చిత్ర టీజర్ ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ..``సత్యం రాజేష్ నాకు మంచి మిత్రుడు. ఓటీటీలో త‌ను న‌టించిన‌ `మా ఊరి పొలిమేర‌` చూశాను. నాకు చాలా బాగా న‌చ్చింది. దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న `మా ఊరి పొలిమేర‌-2` టీజ‌ర్ కూడా చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. మొద‌టి పార్ట్ లా సెకండ్ పార్ట్  కూడా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటూ టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు`` అన్నారు.

ద‌ర్శ‌కుడు డా.అనిల్ విశ్వ‌నాథ్ మాట్లాడుతూ...``లాక్ డౌన్ స‌మ‌యంలో టీవీలో ప్ర‌సార‌మైన ఒక‌ రియ‌ల్ ఇన్స్ డెంట్ చూసి ఇన్ స్పైర్ అయి ఈ క‌థ రాసుకున్నా. మా ఊరి పొలిమేర తీసే స‌మ‌యంలోనే సెకండ్ పార్ట్  క‌థ కూడా రాశాను.  గ్రామీణ నేప‌థ్యంలో జ‌రిగే క‌థ కాబ‌ట్టి.. క్యార‌క్ట‌ర్స్ త‌గ్గ‌ట్టుగా  బోల్డ్ డైలాగ్స్, సీన్స్ ఉంటాయి త‌ప్ప‌..ఎక్క‌డా కావాల‌ని ఏదీ పెట్ట‌లేదు. నిజంగా బ్లాక్ మ్యాజిక్ ఉందా?  లేదా? అనే డెబిట్ మీద వెళ్ల‌లేదు. ఒక వేళ ఉంటే ఎలా ఉంటుంది అనేది చూపించే ప్ర‌య‌త్నం చేశాము. పాడేరు, కేర‌ళ‌, ఉత్త‌రాఖండ్ లో షూటింగ్ చేశాము. 

సెకండ్ పార్ట్ లో ప‌ద్మ‌నాభ స్వామి టెంపుల్ అంశాన్ని కూడా లైట్ గా ట‌చ్ చేసే ప్ర‌య‌త్నం చేశాము. అది ఏంటో  తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇది మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో సాగే చిత్రం. అందులో బ్లాక్ మ్యాజిక్ అనే అంశాన్ని జోడించాము. మా నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నేను అడిగిన ప్ర‌తిదీ స‌మ‌కూర్చారు. స‌త్యం రాజేష్‌, కామాక్షి అద్భుతంగా న‌టించారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా సెకండ్ పార్ట్ ఉండ‌బోతుంది. మా సినిమా టీజ‌ర్ వ‌రుణ్ తేజ్ గారు లాంచ్ చేసి మా సినిమాకు మరితం బ‌జ్ తెచ్చారు`` అన్నారు.

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ