నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఇంటి త్రీవ విషాదం నెలకొంది. ఆయన తల్లి ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె చివరి కోరిక ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా అధినేత టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) ఎన్నో చిత్రాలను ప్రేక్షకులను అందిస్తున్నారు. ఓకేసారి పదుల సంఖ్యలో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాతగా ఉన్నారు. టాలీవుడ్ లో లీడింగ్ ప్రొడ్యూసర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే టీజీ విశ్వ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈరోజు ఆయన తల్లి టీజీ గీతాంజలి (70) కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోజు సాయంత్రం 6.10 నిమిషాలకు ఆమె శివైక్యం చెందారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గీతాంజలి చికిత్స పొందుతున్నారు. కోలుకోలేని పరిస్థితుల కారణంగా ఆవిడ చివరి కోరిక మేరకు తనయుడు విశ్వప్రసాద్ వారాణాసికి తీసుకువెళ్ళారు. ఇక అక్కడ ఆమె దైవ దర్శనం కూడా చేసుకున్నారు. అనంతరం తుది శ్వాస విడిచారు. గీతాంజలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విశ్వప్రసాద్ పెద్దకొడుకు. తల్లి కోరిక మేరకే వారణాసిలో ఆవిడ అంత్యక్రియలు జరుగుతాయని విశ్వప్రసాద్ తెలిపారు.
undefined
ఇక విశ్వ ప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై వరుసబెట్టిసినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం.. త్వరలోనే
యాభై సినిమాలు కంప్లీట్ చేయబోతున్నారని చెప్పారు. ఓ పది సినిమాల వరకు ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్నాయి. రీసెంట్ గా ‘రామబాణం’, ’టక్కర్’ వంటి చిత్రాలు ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చాయి. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ను తెలుగు స్టేట్స్ లో నిర్మాత టీజీ ప్రసాదే విడుదల చేసిన విషయం తెలిసిందే.
వీలైనంత త్వరగా తమ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వంద సినిమాలు నిర్మించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.
ప్రస్తుతం నిర్మించే చిత్రాల్లో పవన్ కళ్యాణ్ `బ్రో` Broతోపాటు ప్రభాస్-మారుతి సినిమాలు పెద్దవి. మున్ముందు తమ బ్యానర్ లో హాలీవుడ్ సినిమాలు కూడా నిర్మించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రొడక్షన్ హౌజ్ తో పాటు టీజీ విశ్వ ప్రసాద్ కు యూఎస్‌లోనూ పలు బిజినెస్ లు ఉన్నాయి.