ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' ఫస్ట్ లుక్ విడుదల.. పోస్టర్ తోనే హైప్ పెంచేశారుగా.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

By Asianet News  |  First Published Jun 30, 2023, 6:53 PM IST

తమిళ స్టార్ ధనుష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. తాజాగా యూనిట్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. 
 


నేషనల్ అవార్డు గ్రహీత సూపర్ స్టార్ ధనుష్ (Dhanush)  తెలుగులోనూ పాపులర్ హీరో అనే విషయం తెలిసిందే. దీంతో ధనుష్ చిత్రాల కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. చివరిగా డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ‘సార్’తో హిట్ ను సొంతం చేసుకున్నారు. మంచి కంటెంట్ తో ఎప్పుడూ ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ధనుష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ పై అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. 

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం Captain Miller  షూటింగ్ శరవేగంగా జరగుతోంది. పీరియాడికల్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.  1930-40ల నేపథ్యంలో సినిమా కథ ఉండనుంది. ఈ చిత్రాన్ని టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్ మరియు సెంధిల్ త్యాగరాజన్ మరియు అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Latest Videos

ఎప్పటి నుంచో ఈ మూవీ ఫస్ట్ అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ సినిమా ఫస్ట్‌లుక్‌ ను విడుదల చేశారు. పోస్టర్ అదిరిపోయింది. సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. పోస్టర్ లో ధనుష్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. యుద్ధ వాతావరణంలో  చుట్టూ నెలకొరిగిన సైనికులు మధ్య ధనుష్ నిలబడి కనిపించారు. కఠినమైన అవతార్‌లో షాకింగ్ లుక్ లో ఆశ్చర్యపరిచారు. అక్కడి యుద్ధంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తిగా కనిపించాడు. ఒక్క పోస్టర్  తోనే సినిమాపై యూనిట్ భారీ అంచనాలను పెంచేసింది.  ఇక మున్ముందు వచ్చే అప్డేట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. 

ఇక ఈ చిత్రంలో ప్రముఖ నటులు సందీప్ కిషన్, లెజెండరీ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ధనుష్ సరసన ప్రియాంక మోహన్ (Priyanka Arul Mohan) కనిపించనుంది. బాహుబలి ఫ్రాంచైజీ, RRR, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాశారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు, సినిమాకు టి. రామలింగం ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Captain Miller First look ! Respect is freedom pic.twitter.com/DDrFjjO46r

— Dhanush (@dhanushkraja)
click me!