Godse Teaser : మెగాస్టార్ రిలీజ్ చేసిన గాడ్సే మూవీ టీజర్

Published : Dec 20, 2021, 03:05 PM IST
Godse Teaser : మెగాస్టార్ రిలీజ్ చేసిన గాడ్సే మూవీ టీజర్

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది.. సత్యదేవ్ గాడ్సే మూవీ టీజర్. ఈ సారి కూడా డిఫెరెంట్ కాన్సెప్ట్ తో అలరించడానికి రెడీగా ఉన్నాడు యంగ్ స్టార్ సత్య.

డిఫరెంట్ కాన్సెప్ట్ లను సెలక్ట్ చేసుకుంటూ.. మంచి కథలతో సినిమాలు చేస్తూ వస్తున్న టాలీవుడ్ యంగ్ స్టార్ సత్యదేవ్‌(Satya Dev) హీరోగా.. దర్శకుడు గోపీ గణేశ్‌ బినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా గాడ్సే(Godse). ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీ నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది. నినాదం వెనుక ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు దాగున్నాయో తెలుసుకోనంత కాలం ప్ర‌జ‌లు మోస‌పోతూనే ఉంటారు' అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ తో టీజర్ ను రిలీజ్ చేశారు టీమ్.  

'గాడ్సే'(Godse)  టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. హీరో సత్యదేవ్(Satya Dev)  తో పాటు డైరెక్టర్ గోపి, సినిమా నిర్మాత సి కల్యాణ్ లను చిరంజీవి ట్విట్టర్ లో అభినందించారు. ఈ సినిమాలో గాడ్సే పాత్ర‌లో స‌త్యదేవ్(Satya Dev)  న‌టించాడు. టీజర్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను గట్టిగా ఆడ్ చేశారు. టీజర్ లో గాడ్సే కోసం పోలీసులు గాలిస్తున్న‌ట్లు చూపించారు. అతను ఏం చేశాడు... ?ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? గాడ్సే(Godse)  అస‌లు పేరు ఏంటీ? అంటూ అద్భుతంగా టీజర్ కట్ చేశారుటీమ్.

 

 ఇక్క‌డ ఏం జ‌రుగుతుందో నాకు తెలియాలి అంటూ.. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి  ఇన్ వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపంచింది. ఈ విషయంపై సీరియస్ గా ఆమె విచారిస్తున్నట్టు టీజర్ లో చూపించారు టీమ్. అటు సత్యదేవ్(Satya Dev)  గాడ్సే(Godse) పాత్రలో తుపాకులు ప‌ట్టుకుని పోరాడుతోన్న సీన్ల‌ను చూపించారు. అందరినీ ఆకట్టుకునేలా ఉన్న టీజ‌ర్ ను చూస్తే.. మైండ్‌ గేమ్‌ తరహాలో ఈ సినిమా క‌థ ఉండబోతున్న్టు తెలుస్తోంది..

మొదటి నుంచీ ఇటువంటి కొత్త కథలు.. ఇంతకు ముందు ఎప్పుడూ టచ్ చేయని కథలను తీసుకుని సినిమాలు చేస్తున్నాడు సత్యదేవ్(Satya Dev). సక్ససె.. ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ..ఇండస్ట్రీలో తనకూంట ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు సత్య. జ్యోతిలక్ష్మీతో.. స్టార్ట్ చేసి.. బ్లఫ్ మాస్టర్, అంతరిక్షంలో.. ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాల్లో తన మార్క్ యాక్టింగ్ తో ఆడియన్స్ లో గట్టిగా రిజిస్టర్ అయ్యాడు యంగ్ స్టార్. ఇప్పుడు ఈ గాడ్సే మూవీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

Also Read : Pushpa Collections : మూడోరోజూ బాక్సాఫీస్ దగ్గర పుష్ప దూకుడు.. సక్సెస్ పార్టీ ఎప్పుడంటే..?

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌