ప్రేమికుడు జక్కీ భగ్నానీతో వివాహం ... రకుల్ ఓపెన్ కామెంట్

Published : Dec 20, 2021, 02:11 PM ISTUpdated : Dec 20, 2021, 02:12 PM IST
ప్రేమికుడు జక్కీ భగ్నానీతో వివాహం ... రకుల్ ఓపెన్ కామెంట్

సారాంశం

రకుల్ సడన్ గా తన లవర్ ని పరిచయం చేసి ఫ్యాన్స్ కి ఒకింత షాక్ ఇచ్చింది. ఆమె లవర్ విషయం బయటపెట్టిన నాటి నుండి పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రకుల్, జక్కీ భగ్నానీ వివాహం ఇక లాంఛనమే అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఇటీవల 31వ బర్త్ డే జరుపుకున్న రకుల్ ప్రీత్ (Rakul preeth singh)... అదే రోజు తన ప్రేమికుడిని పరిచయం చేసింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జక్కీ భగ్నానీ తన బెటర్ హాఫ్ అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది. రకుల్ సడన్ గా తన లవర్ ని పరిచయం చేసి ఫ్యాన్స్ కి ఒకింత షాక్ ఇచ్చింది. ఆమె లవర్ విషయం బయటపెట్టిన నాటి నుండి పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రకుల్, జక్కీ భగ్నానీ వివాహం ఇక లాంఛనమే అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. మీడియా ముఖంగా జక్కీ(jackky bhagnani)తో తన వివాహం గురించి ఓపెన్ కామెంట్ చేశారు. రకుల్ ఛత్రీవాలా షూటింగ్ కొరకు లక్నో వెళ్లారు. 40 రోజులకు పైగా ఛత్రీవాలా షూటింగ్ లక్నోలో జరిగింది. లక్నో షెడ్యూల్ తో ఛత్రీవాలా షూటింగ్ ముగిసింది. ''లక్నోలో ఇన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొనడం నా కెరీర్‌లో ఇదే తొలిసారి. ఇండస్ట్రీలో నాకు మార్పు కనిపిస్తోంది. సినిమాల్లో వర్క్‌ చేసే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మహిళా దర్శకులు, రచయితలు ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇదే విధానం భవిష్యత్‌లోనూ కొనసాగాలని కోరుకుంటున్నాను'' అన్నారు. 

అనంతరం విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా జక్కీతో వివాహానికి ఇంకా సమయం ఉందన్నారు. దేనికైనా టైం రావాలి. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్ పైనే. ఆ రోజు వచ్చిననాడు మీకు ఖచ్చితంగా చెబుతానని రకుల్ ప్రీత్ తెలియజేశారు. అలాగే డిజిటల్ ఎంట్రీ పై కూడా ఆమె స్పందించారు. ఏదైనా ఛాలెంజింగ్ రోల్ వస్తే డిజిటల్ సిరీస్ చెయ్యడానికి సిద్ధం అన్నారు. 
ఇక టాలీవుడ్ లో రకుల్ కెరీర్ దాదాపు ముగిసింది. 

తెలుగులో ఆమె చివరి రెండు చిత్రాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. నితిన్ చెక్, వైష్ణవ్ కొండపొలం చిత్రాలు కనీస ఆదరణ దక్కించుకో లేకపోయాయి. బాలీవుడ్ లో మాత్రం ఆమె జోరు చూపిస్తున్నారు. హిందీలో అరడజను చిత్రాలు వరకు ఆమె ఖాతాలో ఉన్నాయి. వాటిలో అటాక్, థాంక్ గాడ్, డాక్టర్ జి చిత్రాలపై అంచనాలున్నాయి. 

Also readషాకింగ్ న్యూస్... హీరోయిన్ హంసా నందికి బ్రెస్ట్ క్యాన్సర్..!

మరోవైపు రకుల్ తరచుగా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముంబై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్, హైదరాబాద్ లో ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. హీరో రానా, దర్శకుడు పూరి, ఛార్మి, రవితేజ, తరుణ్ మరికొందరు ప్రముఖులు డ్రగ్స్ ఆరోపణలతో ఈడీ ఎదుట హాజరయ్యారు. 

Also read Samantha Special Song: ట్రోల్స్ చేస్తున్నా.. నవ్వుతూ స్పందించిన సమంత..

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌