Pushpa Collections : మూడోరోజూ బాక్సాఫీస్ దగ్గర పుష్ప దూకుడు.. సక్సెస్ పార్టీ ఎప్పుడంటే..?

Published : Dec 20, 2021, 01:48 PM ISTUpdated : Dec 20, 2021, 02:29 PM IST
Pushpa Collections : మూడోరోజూ బాక్సాఫీస్ దగ్గర పుష్ప దూకుడు.. సక్సెస్ పార్టీ ఎప్పుడంటే..?

సారాంశం

పుష్ప దూకుడు మామూలుగా లేదు. కలెక్షన్ల సునామీ కురిపిస్తున్న ఈమూవీ.. మూడో రోజు కూడా అదే దూకుడు చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17 న రిలీజ్ అయిన పుష్ప  బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.

అల్లు అర్జున్(Allu Arjun ) పుష్ప పార్ట్ 1 మూవీ కలెక్షన్ల వాన కురిపిస్తుంద. సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మేకర్స్ నిర్మించిన ఈమూవీ కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. రిలీజ్ అయిన ఫస్ట్  డే నుంచే త‌గ్గేదే లే అంటున్నాడు పుష్ప రాజ్. వసూళ్ల సునామీతో పుష్ప దూసుకుపోతున్నాడు. అల్లు అర్జున్(Allu Arjun )- రష్మిక(Rashmika) జంటగా.. జీనియస్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబినేష‌న్‌లో తెరకెక్కిన  'పుష్ప' (Pushpa) డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. నైజాంలో తొలి రోజే బాహుబ‌లి-2 వ‌సూళ్ల‌ రికార్డులను తిరగరాసిన పుష్ప.. ఆలిండియా రికార్డు సృష్టించింది రెండో రోజు తో కలపుకుని 116 కోట్ల గ్రాస్ వసూలు చేసింది పుష్ప.. ఇక మూడో రోజు కూడా తన దూకుడు చూపించిందీ మూవీ.

 

మూడో రోజు ఆదివారం కావడంలో పుష్ప వైబ్రేషన్స్ గట్టిగానే తగిలాయి. థియేటర్లన్నీ కళకళలాడాయి. కోవిడ్ భయాన్ని కూడా మర్చిపోయిన జనాలు థియేటర్లకు వచ్చారు .. పుష్ప మూవీ మ్యానియాతో మూడో రోజు కలెక్షన్లు గట్టిగానే వచ్చాయి. ఇప్పటి వరకూ ప్రంచ వ్యాప్తంగా 173 కోట్ల వరకూ గ్రాస్ కలెక్షన్లు సాధించింది పుష్ప మూవీ.  ఈ ఏడాది ఇండియాలో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించి సినిమా పుష్ప మాత్రమే.

పుష్ప మూడు రోజుల కలెక్షన్స్ కు సంబంధించి నిర్మాతలు స్పందించారు. మైత్రీ మేకర్స్ మీడియాతో మాట్లాడారు. అందులో  నిర్మాత ఎర్నేని నవీన్ మాట్లాడుతూ..పుష్ప అల్ టైం బ్లాక్ బస్టర్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 85 కోట్లు షేర్ ను క్రాస్  చేసింది. అంతే కాదు 173 కోట్లు గ్రాస్ చేసింది. ఈరోజు(సోమవారం) కూడా కలెక్షన్స్ స్ట్రాంగ్ గా వున్నాయి అన్నారు. మేము పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాము కానీ ఇంత పెద్ద రేంజ్ లో వెళ్తుంది అని అనుకోలేదన్నారు. అంతే కాదు.. రేపు తిరుపతి లో సక్సెస్ మిట్ కూడా పెట్టబోతున్నట్టు నిర్మాత  తెలిపారు.

 

సౌండ్ విషయం లో ఇబ్బందులు తలెత్తిన మాట నిజమే అన్నారు పుష్ప నిర్మాతలు. కొన్ని మార్పులు చేశాము కాని.. సినిమా డ్యూరేషన్ పై దాని ప్రభావం ఉండదన్నారు. సినిమా విషయంలో డైరెక్టర్ సుకుమార్ చాలా హ్యాపీగా ఉన్నారూ..ఆయన పుష్ప సినిమాతో మైత్రీ బ్యానర్ బ్రాండ్ వాల్యూ పెంచారంటూ సుకుమార్ ను పొగిడారు.

Also Read : Samantha Special Song: ట్రోల్స్ చేస్తున్నా.. నవ్వుతూ స్పందించిన సమంత..

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెర్రీ మాట్లాడుతూ..హిందీలో పుష్ప దూసుకుపోతుందన్నారు.  మూడు రోజులకుగాను హిందీ మార్కెట్ లో..పుష్ప 12 కోట్లు వసూలు చేసింది. మలయాళం సెంటర్స్ లో ఫస్ట్ పడలేదు. దానికి అక్కడ బన్నీ  ఫ్యాన్స్ కొంత డిస్సపాయింట్ అయారు. కాని తరువాత సినిమా చూసి చాలా హ్యాపీగా ఉన్నారు... అక్కడ కలెక్షన్స్ కూడా స్ట్రాంగ్ గా వున్నాయన్నారు చెర్రీ.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం